వైసీపీ హయాంలో జరిగిన కల్తీ లిక్కర్ దాంతో తీవ్రతను పకడ్బందీగా బయట పెట్టేందుకు ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోంది. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా 2022లో జంగారెడ్డి గూడెంలో వరుసగా అసహజ మరణాలు చోటు చేసుకున్నాయి. దాదాపుగా ఇరవై మంది చనిపోయారు. కానీ ప్రభుత్వం సరిగ్గా విచారణ చేయలేదు. కల్తీ నీరు అని.. డయేరియా అని చెప్పి కవర్ చేసుకుంది. మృతులకు పెద్దగా పరీక్షలు కూడా చేయించలేదు. అవి కల్తీ మద్యం మరణాలు అని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. అప్పట్లో జరిగిన అసహజ మరణాల కేసులపై పూర్తి వివరాలు సేకరించి..దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను నియమించారు. ఆ మరణాలన్నీ కల్తీ మద్యం కారణంగా అనే అనుమానాలు ఉన్నందున పూర్తి స్థాయిలో అధ్యనం చేయాలని ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ చీఫ్గ్ గా ఎస్పీ కిషోర్ ను నియమించారు. మృతుల పోస్టు మార్టం రిపోర్టులను పరిశీలించి వీరు ఎలా చనిపోయారో ..అసలు ఈ మరణాల మిస్టరీ ఏమిటో బయటకు తీయనున్నారు.
ప్రభుత్వ పెద్దలు చేసిన కల్తీ లిక్కర్ దందా కారణంగా ఐదు సంవత్సరాల కోసం వేల మంది ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ మాత్రం క్వాలిటీ లేని.. ప్రమాదకరమైన రసాయనాలు ఉన్న లిక్కర్ ను .. తయారు చేసి అమ్మారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ అంశంపై టీడీపీ రిపోర్టులు తయారు చేయించి..మీడియా ముందు ప్రవేశ పెట్టింది. ఇప్పుడు జంగారెడ్డి గూడెం కల్తీ మద్యం మరణాలకు కారణం ఏమిటో బయటకు వస్తే.. మరింత సంచలనం నమోదయ్యే అవకాశాలు ఉంటాయి.