తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పి లా నూతన భూభారతి -2025 చట్టాన్ని తీసుకువచ్చింది. భూ భారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా రైతులు, భూ యజమానులు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, వారసత్వ నమోదు లాంటి సౌకర్యాలను పొందే అవకాశం ఉంది.
ధరణి లాగే భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ , మ్యుటేషన్ , అప్పీల్ అండ్ రివిజన్, ఆర్వోఆర్ సవరణలు, వ్యవసాయేతర భూమిగా మార్పు వంటి సేవలు పొందవచ్చు. ఇక భూములకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. నిషేధిత భూముల వివరాలు తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కు కావాల్సిన డాక్యుమెంట్లు , దస్తావేజు రిజిస్ట్రేషన్ దరఖాస్తు విధానం సహ అపూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. సర్వే నంబర్ల ఆధారంగా భూముల మార్కెట్ విలువలు తెలుసుకోవచ్చు. సర్వే నంబర్ లేదా పాస్ బుక్ నెంబర్ ఆధారంగా భూ హక్కుల వివరాలు తెలుసుకోవచ్చు. గ్రామాల వారిగా నిషేధిత భూముల వివరాలు తెలుసుకోవచ్చు.
భూ భారతి పోర్టల్లో దస్తావేజు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత.. స్లాట్ బుకింగ్ ప్రకారం తహసీల్దార్ లేదా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన రోజే.. ఒరిజినల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీ చేతికి అందుతుంది. ధరణి చాలా వేగవంతమైన ప్రాసెస్ ను అందిస్తుంది. భూభారతి కూడా అలాగే ఉంది. అమలులో వచ్చే సమస్యలను పరిష్కరించడం కీలకం.,
భూ భారతి అధికారిక వెబ్సైట్ ఇది – https://bhubharati.telangana.gov.in