ఉగ్రవాదుల వేట ఆపేది లేదని వారి అంతం చూస్తామని భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి.. చంపాల్సిన వాళ్లను చంపేశారు. ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదులు స్వేచ్చగా ఉన్నారని అనుకున్నారు. కానీ వారు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. తమను ఎవరు ఎప్పుడు చంపేస్తారో తెలియక కంగారు పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని .. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఈ హత్యలు పాకిస్తాన్ లో సంచలనంగా మారుతున్నాయి.
లష్కరే కో ఫౌండర్ పై కాల్పులు
లాహోర్లో అమీర్ హంజా అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేసి వెళ్లిపోయారు. తర్వాత అమీర్ హంజా ఎవరో బయటకు తెలిసింది. ఆయన మసూద్ అజర్ కు అత్యంత సన్నిహితుడు. అంతే కాదు లష్కరే తోయిబా సహ వ్యవస్థపాకుడు కూడా. భారత వ్యతిరేకత నరనరాల్లోంచి జీర్ణించుకున్న హంజా.. ఉగ్రవాద కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూంటాడు. ఇంట్లో సమయంలో ఎవరో వచ్చి కాల్పులు జరిపారని చెబుతున్నారు. అసలేం జరిగిందో తెలియదు కానీ అతని పరిస్థితి సీరియస్ గా ఉంది. బతకడం కష్టమని చెబుతున్నారు.
గత వారం రజావుల్లా అనే టెర్రరిస్టు కాల్చివేత
గత వారం సింధ్ ఫ్రావిన్స్ లో రజావుల్లా అనే టెర్రరిస్టును కాల్చివేశారు. భారత్లో అనేక ఉగ్రదాడులకు ప్రణాళిక రచించి, వాటిని అమలుపరచడంలో కీలకపాత్ర పోషించిన ఉగ్రవాది రజావుల్లా నిజామనీ అలియాస్ అబు సైఫుల్లా. భారత్కు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఇతనికి భద్రత కల్పించింది. కానీ గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు.
భారత్ కు ఇలా చంపేస్తామని పాక్ ప్రభుత్వం హామీ ఇచ్చిందా?
ఉగ్రవాదుల్ని అప్పగించే వరకూ యుద్ధం ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. కానీ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఆ ఒప్పందం వివరాలేమిటో బయటకు రాలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది చూస్తే.. ఉగ్రవాదుల్ని అప్పగించడం కన్నా.. తమ దేశంలోనే హతం చేస్తామని పాకిస్తాన్ మాటిచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆ మేరకు ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం సీక్రెట్ గా లేపేస్తోందని అంటున్నారు. భారత్ ఇచ్చిన లిస్టులో ఎంత మంది ఉన్నారో కానీ పాకిస్తాన్ టెర్రరిస్టులు మాత్రం వణికిపోతున్నారు. తమకు పాకిస్తాన్ లో కూడా రక్షణ లేదా అని భయపడుతున్నారు.