కాళేశ్వరం విషయంలో అక్రమాలు జరిగాయని జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. అ కమిషన్ గడువు రెండు నెలలు పొగిడించి. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ లకు నోటీసులు ఇప్పించారు. ఇప్పుడు వారిని ప్రశ్నిస్తారు. అయితే అక్కడ కొత్త విషయాలు ఏమీ బయటకు రావు. కానీ మీడియాలో మాత్రం ప్రచారం జరుగుతుంది. తమను వేధిస్తున్నారని.. ప్రజల కోసం పని చేసిన తమను టార్గెట్ చేశారని చెప్పుకుంటారు. బీఆర్ఎస్ అదే హైలెట్ చేస్తుంది. ఇప్పటికి కమిషన్ ఎంత పవర్ ఫుల్ అన్నదానిపై క్లారిటీలేదు.
కేసీఆర్, హరీష్ రావు విచారణకు రావడం కష్టమే !
కాళేశ్వరం ప్రాజెక్టుకు అనధికారిక చీఫ్ ఇంజినీర్ గా పని చేసిన కేసీఆర్.. మొదటి టర్మ్ లో నీటి పారుదల మంత్రిగా చేసిన హరీష్ రావులతో పాటు ఆర్థిక మంత్రిగా పడని చేసిన ఎంపీ ఈటల రాజేందర్ కూ నోటీసులు జారీ చేశారు. తాను హాజరవుతానని రాజేందర్ ప్రకటించారు. మిగతా ఇద్దరి విషయంలో బీఆర్ఎస్ స్పష్టత ఇవ్వలేదు. ఆ నోటీసులు దూదిపింజతో సమానం అని కేటీఆర్ అంటున్నారు. అంటే పట్టించుకునేది లేదని ఆయన అభిప్రాయం కావొచ్చు. హాజరు కాకుండా ఉండేందుకు కోర్టులకు వెళ్లే అవకాశం ఉంది.
చత్తీస్ఘడ్ విద్యుత్‌పై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికపై సైలెంట్
తెలంగాణలో ప్రభుత్వం మారగానే చత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ చేసిన కరెంట్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ కోసం జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేశారు. ఆయన ప్రెస్మీట్లు పెట్టి ఆరోపణలు చేస్తున్నారని కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చారు. జస్టిస్ మదన్ లోకూర్ ను నియమించారు. ఆయన విచారణ పూర్తి చేసి… నివేదిక సమర్పించారు. అసెంబ్లీలో పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు కానీ ఇంత వరకూ దాని గురించి పట్టించుకోలేదు. అందుకే ఏమైనా సీరియస్ టాపిక్స్ ఉంటే సైలెంటుగా ఉండేదుకు అవకాశం ఉండదని భావిస్తున్నారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో చర్యలు తీసుకోలేరు !
జస్టిస్ పీసీ ఘోష్..కాళేశ్వరం అవతవకలపై నివేదికలు సమర్పిస్తారు. అందరూ కేసీఆర్ పేరు చెప్పినట్లుగా ఇప్పటికే ప్రచారం జరిగింది. మొత్తం డిజైన్ల దగ్గరి నుంచి అన్ని ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. అయితే అందుకే కేసీఆర్ కు ఆ బాధ్యత అధికారికంగా లేదు. ఎవరి పని వాళ్లు చేయాలి. అది అధికారులు చేయలేదు. దానికి బాధ్యత తీసుకోవాల్సింది వాళ్లే. వాళ్లే నిందితులవుతారు. కేసీఆర్ చెప్పాడని తాము చేశామని తప్పించుకోలేరు.
ఈ కమిషన్లు తప్పులు ఎక్కడ జరిగాయో విచారణ చేసి నివేదికలు ఇవ్వగలవు కానీ.. చర్యలు తీసుకోలేవు. అయితే వీటి ఆధారంగా ప్రభుత్వం కేసులు పెట్టవచ్చు. అందుకే. ఈ కమిషన్ల వల్ల వేధిస్తున్నారని విపక్ష నేతలు ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ది పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.