గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లాలు ఉండటం చాలా మందికి ఓ డ్రీమ్. విల్లాలు అంటే సిటీల్లో ఉండే అవకాశం లేదు. శివారు ప్రాంతాల్లోనే ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయి. అయితే ఇప్పుడు వాటి రేట్లు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. కోటి పైనే ఉంటున్నాయి. కానీ కొన్ని కొన్ని చోట్ల యాభై లక్షలకు కూడా అందుబాటులో ఉన్నాయి.
శంషాబాద్ దాటిన తర్వాత కడ్తాల్ వద్ద ఉన్న కొన్ని విల్లా ప్రాజెక్టుల్లో యాభై లక్షలకు ఇళ్లు ఉన్నాయి. ఇవి వెయ్యి ఎస్ఎఫ్టీలోపే సింగిల్ ఫ్లోర్ ఇళ్లు. గేటెడ్ కమ్యూనిటీగా నిర్మిస్తున్నారు. తుక్కుగూడ పరిధిలోనూ.. శంషాబాద్ , ఫార్మా సిటీకి సమీపంలో కూడా యాభై లక్షల లోపు విల్లా ఇళ్లు అమ్ముతున్నారు. ఇక ఘట్ కేసర్ పరిధిలో కొన్ని సంస్థలు 2 BHK , 3 BHK విల్లాలు తక్కువ ధరలకే అమ్ముతున్నాయి. ఈ ప్రాంతం వరంగల్ హైవేతో కనెక్ట్ అయి ఉంటుంది.
ఇక ముంబై హైవేపై రుద్రారం వైపు 3 BHK విల్లాలు రూ. 99 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. నాగారం గ్రామ పరిధిలో 100 చదరపు గజాలలో 2 BHK ఇండిపెండెంట్ హౌస్‌లు రూ. 45 లక్షల నుండి అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతం ECIL , రాంపల్లి X రోడ్‌కు సమీపంలో ఉంది. ఇస్మాయిల్‌ఖాన్‌పేట్ పరిధిలోనూ రూ. 50 లక్షలు ఉన్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
విల్లాలు గేటెడ్ కమ్యూనిటీలలో ఉంటాయి, స్విమ్మింగ్ పూల్, క్లబ్‌హౌస్, 24/7 సెక్యూరిటీ, జాగింగ్ ట్రాక్ వంటి సౌకర్యాలతో ఉంటాయి. అందుకే ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ వీక్ గా ఉండటం వల్ల ధరలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి చోట్ల అన్వేషిస్తే.. విల్లా కోరికను మధ్యతరగతి ప్రజలు నెరవేర్చుకోవచ్చు.