తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్ ను నియమించినప్పుడు.. ఇక అందర్నీ సెట్ రైట్ చేస్తారని అనుకున్నారు. ఒక్కరూ నోరెత్తరని.. అసలు క్రమశిక్షణ అంటే ఏంటో ఆమె చూపిస్తారని అనుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. పార్టీ స్టాండ్ ను బలంగా తీసుకెళ్లాల్సిన పొజిషన్ లో ఉన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా పరువు తీశారు.ఇక మిగతా వాళ్ల సంగతి చెప్పాల్సి పని లేదు.
పదవుల కోసం ఎదురు చూసి అవకాశం రాదు అనుకుంటున్న వారు.. పార్టీని రోడ్డున పడేయడానికి సిద్ధంగా ఉన్నారు. గొడవలు చేయడం ద్వారా.. పదవి రాకపోతే ఇది సింపులేనని.. తర్వాత అసలు కథ చూపిస్తామని హెచ్చరికలు పంపడం ఒకటి అయితే.. దేనికైనా తెగిస్తానని సందేశం పంపడం మరొకటి. అప్పుడైనా పదవులు ఇస్తారని వారి ఆశ. ఇలాంటి వారిపై కనీస మాత్రం చర్యలు తీసుకోలేని దుస్థితి వల్ల.. ఈ వ్యూహాలను పాటించేవారు పెరిగిపోతున్నారు.
దీంతో తలనొప్పులు ఎక్కువైపోతున్నాయి.
ఓ వైపు చర్యలు తీసుకవడంలో వెనుకాడుతున్నారు. మరో వైపు పదవులు పంచలేకపోతున్నారు. మంత్రి పదవులే కాదు..నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వడం లేదు. వీరిని కంట్రోల్ లో పెడతారని అనుకున్న కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు కూడా అప్పుడే విషయం అర్థమైపోయిందని సైలెంట్ అయిపోయారని అంటున్నారు. మీనాక్షి నటరాజన్ ఎప్పుడో ఓ సారి వచ్చి సమీక్షలు చేసి వెళ్లిపోతున్నారు. నేతల్ని దారిలో పెట్టే ప్రయత్నాలు చేయడం లేదు.