బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం నుంచి ఆర్మీ రూల్ వైపు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజామోదం లేదని.. ప్రజలకు సంబంధం లేని పాలకుడు అయిన మహమ్మద్ యూనస్ ఎన్నికలు పెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాదిలో ఎన్నికలు పెట్టాలని ఆర్మీ చీఫ్ అంటున్నాడు . కానీ ఇప్పుడే ఎన్నికలు వద్దని.. మరో ఏడాది లేకపోతే ఐదు సంవత్సరాల పాటు యూనస్ నే కొనసాగించాలని ఆయన మద్దతు దారులు ర్యాలీలు చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని తరిమేసి.. తాను ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నది కాకుండా ఎన్నికల వద్దని యూనస్ పట్టుబడుతున్నారు.
పాలనలో బంగ్లా ఆర్మీ చీఫ్ నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. విధానాలు ఖరారు చేస్తున్నారు. ఇది కూడా యూనస్‌కు నచ్చడం లేదు. పాకిస్తాన్, చైనా విషయాలతో పాటు మయన్మార్ కు రహదారి నిర్మించాలని ఆయన కోరుతున్నారు. అక్కడి నుంచి రోహింగ్యాలు బంగ్లాదేశ్ కు స్వేచ్చగా వచ్చే..మానవతా సాయం చేయాలని యూనస్ కోరుకుంటున్నారు. దీన్ని ఆర్మీ వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాలతో మహమ్మద్ యూనస్ తాను వైదొలుగుతానని బెదిరింపులు ప్రారంభించారు. ఆయన మద్దతు దారులు అదే చెబుతున్నారు. ఆయన వైదొలుగుతానని అంటున్నారని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్మీ చీఫ్ .. గతంలో మహమ్మద్ యూనస్‌కు మద్దతుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఆయన పట్ల అంత ఆసక్తిగా లేరు. ఆయనను తప్పించడానికి రెడీగా ఉన్నారు. దానికి ఎన్నికలే సరైన మార్గం అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహిస్తే పాకిస్తాన్ లో ఆర్మీ లాగా పరోక్ష పాలన చేయవచ్చని అనుకుంటున్నారు. కానీ ఎన్నికల నిర్వహణకు యూనస్ అడ్డం పడితే ఆయనను పదవి నుంచి తప్పించి సైన్యమే .. పాలనా పగ్గాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.