మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ వెళ్లిపోయారు. వారం రోజుల కిందటే ఆమె వెళ్లిపోయిన.. లండన్ వెళ్లిపోయి అక్కడ మీడియాకు ఇంటర్యూ ఇచ్చేదాకా అసలు విషయం బయటకు రాలేదు. పోటీ అంతా పాత కాలం పద్దతుల్లో జరుగుతోందని.. నిర్వాహకులు తనను వేశ్యలాగా ట్రీట్ చేశామని అక్కడ మీడియా ముందు ఆమె ఆరోపణలు చేసింది. ఈ పోటీలు హైదరాబాద్ లో జరుగుతూండటంతో సహజంగానే ఈ వివాదం కలకలం రేపుతోంది.
మిల్లా మాగీ పలు రౌండ్లలో పాల్గొన్న తర్వాత మే 19, 2025న యూకేకి తిరిగి వెళ్లిపోయింది. మిల్లా మాగీ వ్యక్తిగత కారణాల వల్ల యూకేకి తిరిగి వెళ్లిపోయింది. ఆమె నిర్ణయాన్ని మేము పూర్తిగా సమర్థిస్తాము అని మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ డైరక్టర్ అధికారికంగా ప్రకటించారు. కానీ మిల్లా మాగీ మాత్రం రిటిష్ టాబ్లాయిడ్ ‘ది సన్’ కు ఇచ్చిన ఇంటర్యూలో పోటీదారులు ఎల్లప్పుడూ మేకప్ ధరించాలని, రోజంతా బాల్ గౌన్లలో ఉండాలని, ఆర్థిక సహకారం అందించిన మధ్యవయస్క పురుషులతో సన్నిహితంగా మెలగాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించింది.
మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధి ఈ ఆరోపణలను “పూర్తిగా ఆధారరహితం, కల్పితం” అని ఖండించిారు. మరియు మిల్లా వైదొలగడానికి ఆరోగ్య కారణాలే ప్రధానమని పేర్కొన్నారు. మిల్లా వైదొలగడంతో, మిస్ ఇంగ్లాండ్ రన్నర్-అప్ ఛార్లెట్ గ్రాంట్ ఆమె స్థానంలో మిస్ వరల్డ్ పోటీలో ఇంగ్లాండ్‌ను ప్రాతినిధ్యం వహించడానికి హైదరాబాద్‌కు వచ్చింది. మిస్ వరల్డ్ ఫైనల్ మే 31, 2025న హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది.