మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలింగ్ రోజు చేసిన హింస ఏమిటో దేశం మొత్తం చూసింది. రౌడీ మూకలతో ఊళ్ల మీద పడిన చేసిన హింసను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి నడిపించారు. స్వయంగా ఆయుధం పట్టుకుని ఆయన వీరంగం చేశారు. అప్పట్లో కేసులు నమోదు కావడంతో పిన్నెల్లి సోదరులు ఇద్దరూ పరారయ్యారు.
తర్వాత పిన్నెల్లిని పట్టుకున్నారు. జైలుకు పంపారు. బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ హత్యా రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి మాత్రం ఇప్పటి వరకూ పోలీసులకు చిక్కలేదు. ఆయన పరారీలోనే ఉండాలని కోరుకున్నారో.. పోలీసులకు పట్టుకునే తీరిక లేదో కానీ ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్యకు ప్రోత్సాహం ఇచ్చినట్లుగా కేసు నమోదు అయింది.
తమ అనుచరుల్ని టీడీపీలోకి పంపి..టీడీపీ కార్యకర్తల్ని చంపేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ కుట్ర వెలుగు చూడటంతో కేసు నమోదు అయింది. జంట హత్యలు జరిగిన వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆజ్ఞాతంలోకి వెళ్లారు. వెంకట్రామిరెడ్డి ఇప్పటికే ఆజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటికైనా వెంకట్రామిరెడ్డి ఆచూకీ దొరుకుతుందో లేదో మరి !