రుతుపవనాలు ముందస్తుగా రావడంతో ..వర్షాలు వచ్చే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. బెంగళూరు నుంచి ఈ వారం డ్యూటీ కోసం మంగళవారం రావాల్సి ఉంది. మంగళవారం సాయంత్రం తాడేపల్లికి వచ్చి బుధవారం పొదిలి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. పొగాకు వ్యాపారులకు గిట్టుబాటు ధర రావడం లేదని వారిని పరామర్శించాలనుకున్నారు. కానీ హఠాత్తుగా వాయిదా వేసుకున్నారు.
వాయిదాకు కారణం ఏమిటంటే.. రుతుపవనాలు వచ్చేశాయని.. ముందస్తుగా భారీ వర్షాలు కురుస్తాయని ఈ కారణంగా జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారట. ఈ కారణంతో ఆయన యలహంక నుంచి తాడేపల్లికి కూడా వచ్చే అవకాశాలు లేవు . వ్యక్తిగతంగా ఏదో పని పడి ఉంటుందని లేకపోతే.. టీడీపీ మహానాడు జరుగుతూంటే.. తాను ఇలా షో చేస్తే ఎవరూ పట్టించుకోరని అనుకున్నారేమో కానీ వాయిదా వేసుకున్నారు.
జగన్ రెడ్డి ఇలా పొదిలి పర్యటనకు వస్తారు అనగానే వైసీపీ ప్రో మీడియా ఎలివేషన్ స్టోరీలు వండేసింది. జగన్ రెడ్డి టీడీపీకి చెక్ పెట్టేలా ప్లాన్ చేశారని.. టీడీపీ మహానాడుకు ప్రచారం రాకుండా.. ప్రజా సమస్యలను హైలెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే.. వర్షాలు పడతాయని చెప్పగానే వాయిదా వేసుకున్నారు.