గోపీచంద్‌తో హ‌న్సిక‌

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా నిర్మిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా హ‌న్సిక‌… డిఫ‌రెంట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్స్‌ లో న‌టిస్తూ త‌న‌కంటూ మాస్ హీరోగా ప్ర‌త్యేకత‌ను సంపాదించుకున్నాడు గోపీచంద్. `య‌జ్ఞం`, `ఆంధ్రుడు`, `ల‌క్ష్యం`, `శౌర్యం`, `శంఖం`, `గోలీమార్` జిల్ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు `ఆక్సిజ‌న్` అనే మరో డిఫ‌రెంట్ యాక్ష‌న్ చిత్రంలో నటిస్తున్న గోపీచంద్ హీరోగా హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో అన్నీ ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో కూడిన హై ఓల్టేజ్ యాక్ష‌న్‌ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. `ఏమైంది ఈవేళ` అనే యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్‌తో స‌క్సెస్ కొట్టి త‌ర్వాత మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌తో `ర‌చ్చ` అనే సెన్సేష‌న‌ల్ హిట్ సాధించ‌డ‌మే కాకుండా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను `బెంగాల్ టైగ‌ర్` అంటూ స‌రికొత్త యాంగిల్‌లో ప్రెజంట్ చేసిన స్టార్ డైరెక్టర్ సంప‌త్ నంది. ఈ మూడు చిత్రాలను మూడు డిఫరెంట్ ఫార్మేట్స్ లో నిర్మించి హ్యాట్రిక్ సాధించిన దర్శకుడు సంపత్ నంది ద‌ర్శ‌త్వంలో శంఖం, రెబల్ వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్ స‌ర‌స‌న హీరోయిన్‌గా బ‌బ్లీ బ్యూటీ హ‌న్సిక న‌టిస్తుంది. రెండేళ్ళ గ్యాప్ త‌ర్వాత హ‌న్సిక తెలుగులో చేస్తున్న చిత్ర‌మిది. గోపీచంద్‌, సంప‌త్ నంది, జె.భ‌గ‌వాన్‌, పుల్లారావు వంటి టీంతో వ‌ర్క్ చేయ‌డం ప‌ట్ల హ‌న్సిక త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close