టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరికించేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి గట్టి రాజకీయం చేస్తున్నారు. సీఐడీ పోలీసుల ఎదుట హాజరైన ఆయన తన వాంగ్మూలంలో వైసీపీకి మింగుడు పడని విధంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి తప్పేనని ఆ విషయంలో తన పాత్ర లేదని చెప్పారు. అదే సమయంలో ఇలాంటి దాడి పార్టీ పెద్దల కనుసన్నల్లోనే జరిగి ఉంటుందని.. లేకపోతే కార్యకర్తలు అంత ధైర్యం చేయలేరని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను పొలంలో ఉన్నానని కావాలంటే తన ఫోన్ ఇస్తానని కూడా వాదించారు.
తన పాత్ర లేదని చెప్పుకోవడం వరకు ఓకే కానీ.. పార్టీ పెద్దల ప్రమేయం ఉందని గట్టిగా చెప్పడం మాత్రం వైసీపీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఈ దాడి చేయించింది సజ్జల రామకృష్ణారెడ్డేనని వైసీపీలో అందరికీ తెలుసు. పట్టాభి జగన్ రెడ్డిని తిట్టకపోయినా.. సజ్జలనే తిట్టినా జగన్ రెడ్డినే తిట్టాడని ప్రచారం చేయించి.. కార్యకర్తలతో దాడులకు ప్రేరేపించాడు. దేవినేని అవినాష్, అప్పిరెడ్డిల వంటి నేతల రౌడీ మూకల్ని ప్రేరేపించారు. ఇప్పుడు రిస్కులో పడ్డారు.
అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు .. ఆ కేసులో పూర్తిగా సజ్జలను బుక్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. సజ్జల స్టేట్మెంట్ తో పోలీసులకు కావాల్సినంత సమాచారం అందింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి కోటరీ దెబ్బకు కాంగ్రెస్ లో చేరి మళ్లీ వెనక్కి వచ్చారు. ఇప్పుడు పూర్తిగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.