కేసీఆర్ ‘దిక్కుమాలిన’ వ్యాఖ్యలపై కదం తొక్కిన కార్మికులు

హైదరాబాద్: గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెపట్ల కేసీఆర్ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్‌ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. సమ్మెను, వారికి మద్దతిచ్చిన సంఘాలను కించపరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపట్ల కార్మికులు మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి దిగజారుడు వ్యాఖ్యలుచేస్తున్నారని, కార్మిక చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సీపీఎమ్ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, సీఎమ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, తిట్లు తిట్టటం, శాపనార్థాలు పెట్టటం చేస్తే ప్రజాస్వామ్యంలో ఎవరూ ఊరుకోరని అన్నారు. దిక్కుమాలిన సంఘాలు, దిక్కుమాలిన పార్టీలని మాట్లాడుతున్న కేసీఆర్ ఈ దిక్కుమాలినవాళ్ళు ఓట్లేస్తేనే అధికారంలోకి వచ్చారని, వీరి మాటలు వినకపోతే మూడేళ్ళతర్వాత వారి చేతుల్లోనే దిక్కుమాలిన ఓటమి చవిచూస్తారని హెచ్చరించారు. తెలంగాణలో కేసీఆర్ నిన్నకాక మొన్న పుట్టారని, కార్మికసంఘాలు 150 ఏళ్ళక్రితమే పుట్టి ప్రపంచవ్యాప్తంగా కార్మికులను ఐక్యంచేసి హక్కులు, వేతనాలు సాధించాయని గుర్తు చేశారు. కేసీఆర్ వెంటనే దిక్కుమాలిన మాటలు మానుకుని కార్మికసంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ నాలుగురోజులక్రితం ఒక సభలో మాట్లాడుతూ, దిక్కుమాలిన సమ్మెలు చేస్తున్నారంటూ పంచాయతీ కార్మికుల సమ్మెపై మండిపడిన విషయం తెలిసిందే. ఇలాంటి సమ్మెలు ఎన్నో చేయటంవల్లే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని ఆయన మరిచిపోయినట్లున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

మరో డీఐజీ రెడ్డి గారికి ఊస్టింగ్ ఆర్డర్స్

పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close