ఫార్ములా ఈ రేసు కేసులో కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. గతంలో ఆయన ఓ సారి హాజరయ్యారు. ఆ తర్వాత ఫార్ములా ఈ కంపెనీ ప్రతినిధుల్ని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అలాగే స్పాన్సర్ సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఆయా కంపెనీ ప్రతినిధుల్ని ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇవాళ కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు.
కేటీఆర్కు అరెస్టు చేయాలనుకుంటే అడ్డే లేదు !
ఫార్ములా ఈ రేసు కేసులో తనపై నమోదు చేసిన ఏసీబీకేసును క్వాష్ చేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టు వరకూ ప్రయత్నించారు. కానీ ఎక్కడా అనుకూల ఫలితం రాలేదు. దాంతో ఆ స్కాంలో నిజం ఉందన్న ప్రచారం ప్రజల్ోల జరిగింది. క్వాష్ విషయంలో న్యాయపరమైన పోరాటం పొరపాటు అనే భావన ఉన్నా కేటీఆర్ మాత్రం క్వాష్ విషయంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు కూడా చెప్పినట్లయిందన్న వాదన ప్రజల్లోకి వెళ్లింది. ఆయనపై కేసు నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారు. ఈ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేయాలని అనుకుంటే ఏసీబీ అధికారులు చేసేస్తారు.వారికి అడ్డమేం లేదు.
పక్కాగా సాక్ష్యాలు !
ప్రభుత్వ ఖజానాలోని డబ్బులు ప్రైవేటు సంస్థ ఖాతాలోకి వెళ్లిపోయాయి. అది కూడా ఫెమా నిబంధనలు ఉల్లంఘించి నిధులు ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ నిధులు మంజూరు చేయడానికి ఎలాంటి అనుమతి లేదు. స్పాన్సర్ సంస్థ వెనక్కి తగ్గడంతో ఆ డబ్బులు తామే ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ట్రాక్, రేసింగ్ నిర్వహణ, ఇతర ఏర్పాట్లు, మార్కెటింగ్, వివిధ దేశాల రేసర్లకు సౌకర్యాల కల్పన అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఈ ఒ!ప్పందం జరగడానికి ముందే డబ్బులు చెల్లించారు. ఆర్థిక శాఖ.. కేబినెట్ అనుమతి తీసుకోలేదు. దీంతో తరలించిన డబ్బులు దోచేసినట్లుగా మారాయి. తామే ఇచ్చామని కేటీఆర్ చెబుతున్నారు. అంటే ఆయన నేరాన్ని అంగీకరిస్తున్నట్లుగా అవుతోందని నిపుణులు చెబుతున్నారు.
వ్యక్తిగత దూషణలకు దిగుతున్న కేటీఆర్
రేవంత్ పై కేటీఆర్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేసు నమోదు అయినప్పటి నుండి ఇవి పెరిగాయి. ఇటీవల కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో బహిరంగంగా దూషిస్తున్నారు. ఇది ఆయనకు మరింత సమస్యగా మారనుందని చెబుతున్నారు. ఏసీబీ విచారణలోనూ అంతే వ్యవహరిస్తే.. విచారణాధికారులను బెదిరించేలా మాట్లాడితే.. వారికి మరో ఆప్షన్ ఉండదని చెబుతున్నారు.