లిక్కర్ స్కాంలో వసూళ్లు చేసిన వందల కోట్ల నగదును ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు మాస్టర్ మైండ్ గా వ్యవహరించినట్లుగా ఆధారాలు పోలీసులకు దొరికినట్లుగా తెలియగానే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి విచిత్రమైన డ్రామాలు ప్రారంభించారు. ఆ డబ్బుల పంపిణీకి టూల్స్ గా వాడుకున్న కింది స్థాయి పోలీసు ఉద్యోగులతోనే కొత్త డ్రామాలు వేస్తున్నారు. కానీ ఆయన పోలీసులతో పెట్టుకుంటున్నారన్న విషయాన్ని మర్చిపోయారు. అచ్చంగా వంశీ.. చేసిన తప్పే చేసి చెవిరెడ్డి దొరికిపోయారు. ఇప్పుడు అసలు సినిమా ప్రారంభించేందుకు సిట్ రెడీ అయింది.
చెవిరెడ్డి దగ్గర పదేళ్ల పాటు గన్ మెన్ గా పని చేసిన మదన్ రెడ్డిని ఇటీవల సిట్ అధికారులు ప్రశ్నించారు. మదన్ రెడ్డి పోలీస్ ట్యాగ్ పెట్టుకుని చెవిరెడ్డి చెప్పినవన్నీ చేసినట్లుగా గుర్తించారు. దీంతో మదన్ రెడ్డితో తప్పుడు ఆరోపణలు చేయిస్తూ ఓ లేఖ రాయించారు. అందులో సిట్ అధికారులు కొట్టారని.. తాము చెప్పినట్లుగా స్టేట్ మెంట్ ఇవ్వమంటున్నారని కూడా చెప్పారు. అంతే కాదు..మరో గన్ మెన్ .. తాము చెప్పినట్లే స్టేట్ మెంట్ ఇచ్చారని సిట్ అధికారులు చెప్పారని మదన్ రెడ్డి చెప్పారు. మరీ ఇంత కామెడీగా మదన్ రెడ్డికి సిట్ అధికారులు చెబుతారా? . ఆస్పత్రిలో చేరినట్లుగా.. ఓ ఫోటో ను మదన్ రెడ్డి రిలీజ్ చేశారు.
ఇది పూర్తిగా కుట్రపూరితమని.. సిట్ అధికారులకు అర్థమైపోయింది. మదన్ రెడ్డితో ఎలా వ్యవహరించారో వారికి బాగా తెలుసు. అందుకే దీని వెనుక కుట్రను బయటకు తీయడానికి ఏర్పాట్లు చేశారు. ఎవరి ప్రోద్భలంతో ఇలా మదన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారో స్పష్టం తెలుసు. దానికి ఆధారాలు కూడా సేకరించారు. ఈ విషయంపై స్పష్టత రావడం.. రేపో మాపో ఎత్తేస్తారని డౌట్ పడిన చెవిరెడ్డి పారిపోయేందుకు ప్రయత్నించారు. బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ.. లుకౌట్ నోటీసులు ఉండటంతో దొరికిపోయారు. ఇప్పుడు సిట్ ఈ కుట్రల అసలు కథ బయట సెట్టనుంది.