హిట్ అండ్ రన్ కేసులో జగన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. డ్రైవర్ కన్నా ముందు అత్యంత నిర్లక్ష్యం, ఘోరం, పోలీసుల రూల్స్ పాటించకపోవడం, ప్రమాదం జరిగిన తర్వాత బాధితుడ్ని అలా వదిలేయడం సహా జగన్ రెడ్డి చేయకూడని తప్పులన్నీ చేశాడు. నాకు తెలియదు..చూడలేదు అనడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆయనపై ఏ 2గా కేసు నమోదు చేశారు. కానీ కనీసం నోటీసులు ఇచ్చే ధైర్యం అయినా పోలీసులు చేస్తారా లేదా అన్నది స్పష్టత లేదు.
ఘటన జరిగిన రోజున పోలీసులు ..జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. స్వయంగా ఎస్పీకి ప్రెస్ మీట్ పెట్టి జగన్ రెడ్డి వాహనం కాదు.. అసలు జగన్ కాన్వాయ్ కారు కాదని ప్రకటించారు. దాంతో వైసీపీ నేతలు మామూలు రోడ్డు ప్రమాదం మాకు సంబంధం లేదని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కూడా వైసీపీ క్యాడర్ ఎస్పీ పాత వీడియోనే సర్క్యలేట్ చేస్తున్నారు. కళ్ల ముందు కనిపిస్తున్న. వీడియో గురించి మాత్రం చెప్పడంలేదు.
ఓ తప్పు చేసి..దానిని కప్పి పుచ్చుకునేందుకు మరో వంద తప్పులు చేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఇలాంటి నేరం చేస్తే…. హిట్ అండ్ రన్ కింద.. ఇతర సీరియస్ సెక్షన్ల కింద కేసులు పెడతారు. వెంటనే అదుపులోకి తీసుకుంటారు. కానీ ఇక్కడ జగన్ రెడ్డి ఓ మాజీ సీఎం, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు చట్టం వర్తింపు చేయడానికి పోలీసులు ఎందుకు సంకోచిస్తారో అర్థం కాదు. ఇప్పటికే పోలీసులు ఆ కేసు నుంచి జగన్ ను బయటపడేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు ఈ కేసులో చట్టం అందరికీ సమానమేనని నిరూపించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ విషయంలో పోలీసులు రౌడీ రాజకీయానికి తల వంచుతారో.. చట్టం పవర్ చూపిస్తారో చూడాల్సి ఉంది.