పాకిస్తాన్ నుంచి భారత్‌పై దశాబ్దాలుగా ఉగ్రకుట్రలు రచిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేస్తున్నారు. అక్కడ వరుసగా జరుగుతున్న టార్గెట్ కిల్లింగ్స్ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా 2019 నాటి భయానక పుల్వామా ఉగ్రదాడికి పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కీలక మాస్టర్‌మైండ్, నిషేధిత అల్-బద్ర్ కమాండర్ హమ్జా బుర్హాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్‌లో అజ్ఞాత దుండగుల చేతిలో హతమయ్యాడు. చూస్తుండగానే బైక్‌లపై వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై బుల్లెట్ల వర్షం కురిపించి మట్టుబెట్టారు. ఈ తాజా హత్యతో పాక్‌లో ధురంధర్ ఆపరేషన్ జరుగుతోందని టెర్రరిస్టులంతా వణికిపోతున్నారు.
కొద్ది నెలల్లోనే కీలక భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల హతం
గత నెలలోనే లహోర్‌లో లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు అమీర్ హమ్జాను బైక్‌పై వచ్చిన అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపారు. మార్చిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పెద్దన్నయ్య ముహమ్మద్ తాహిర్ అన్వర్ పాక్‌లో అత్యంత మిస్టీరియస్ పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. గతేడాది ముంబై 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు, జమ్మూ కాశ్మీర్ రీసి దాడి నిందితుడైన అబు ఖతాల్ సైతం సింధ్ ప్రాంతంలో గుర్తుతెలియని బుల్లెట్లకు బలైపోయాడు. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్, జైష్‌లకు చెందిన దాదాపు డజనుకు పైగా టాప్ కమాండర్లు ఇలాగే వీధుల్లో, మసీదుల బయట శవాలుగా మారారు.
పాక్‌లో ఉన్నాడా ఆ దురంధర్ ?
సినిమా స్టైల్లో సాగుతున్న ఈ ఆపరేషన్లను చూస్తుంటే.. దురంధర్ లాంటి ఏజెంట్ ఎవరైనా తెర వెనుక ఉండి ఈ కథ నడిపిస్తున్నారా అని పాక్ లో భయపడిపోతున్నారు. అత్యంత పకడ్బందీగా సమాచారాన్ని సేకరించడం, ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టడం, స్థానిక ఏజెంట్ల సాయంతో ఐఎస్ఐ కళ్లుగప్పి పక్కా స్కెచ్ తో లేపేయడం చూస్తుంటే.. ఇదంతా ఎవరో ఒక పవర్ఫుల్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది. పాక్ గడ్డపై ఇన్ని హత్యలు జరుగుతున్నా అక్కడి నిఘా సంస్థలు కనీసం ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోవడం ఆ దురంధర్ మార్క్ ఆపరేషన్ల పదునుకు నిదర్శనం.
న్యూ ఇండియా’ దెబ్బ.. ఉగ్రవాదులకు డెడ్ ఎండ్
ఈ వరుస హత్యలపై పాకిస్తాన్ ప్రభుత్వం నోరుమెదపలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. తమ దేశంలో గ్లోబల్ టెర్రరిస్ట్‌లు ఎవరూ లేరని ఇన్నాళ్లూ అంతర్జాతీయ సమాజం ముందు అబద్ధాలు చెప్పిన పాక్.. ఇప్పుడు వారు తమ వీధుల్లోనే కుప్పకూలుతుండటంతో సమాధానం చెప్పుకోలేక తలపట్టుకుంది. రాబోయే రోజుల్లో ఈ అజ్ఞాత వేటలో ఇంకా ఏ ఏ ఉగ్రవాదుల వికెట్లు పడబోతున్నాయో చూడాలి.