చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లోనే ఉండాలని ఫిక్సయ్యారు. అందు కోసం ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. అవన్నీ చేస్తున్నారు. రికార్డెడ్ విచారణలో చిందులు వేస్తున్నారు. దర్యాప్తు అధికారుల అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. సిట్ ఆఫీసు ఎదుటే ఇల్లు తీసుకుంటానని.. అంతు చూస్తానని అంటున్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ఈ బెదిరింపులకు పాల్పడుతూండటంతో ఆ రికార్డెడ్ వీడియో కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
సాధారణంగా బెయిల్ రావాలంటే.. సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, దర్యాప్తునకు సహకరించాలన్నారు రూల్ ఉంటుంది. కానీ చెవిరెడ్డి తనకు బెయిల్ ఇస్తే అంతు చూస్తానని దర్యాప్తు అధికారుల్నే బెదిరిస్తున్నారంటే కోర్టు సీరియస్ గా తీసుకుంటుంది. అందుకే ఆయన బెయిల్ రావడం కష్టమయ్యే అవకాశాలు ఉంటాయి. కింది స్థాయి నుంచి ఎన్నో అక్రమాలు చేసి ఈ స్థాయికి వచ్చిన చెవిరెడ్డికి ఆ విషయం తెలియకేం కాదు. బెదిరింపులు ఆయన నైజం అయినప్పటికీ.. ఎప్పుడు ఎవర్ని ఎలా బెదిరించాలో ఆయనకు తెలుసు. ఇలా న్యాయవ్యవస్థను కూడా బెదిరిస్తున్నట్లుగా మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు తెలియకుండా ఉండదు.
బయటకు రాకుండా కొన్నాళ్లు జైల్లోనే ఉండాలన్న ఉద్దేశంతోనే చెవిరెడ్డి ఇలా ప్రవర్తిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. చెవిరెడ్డి తరపున క్యాష్ హ్యాండ్లింగ్ చేసిన ఇద్దరు పీఏలను గుంటూరు జైలుకు తరలించారు. విజయవాడ జైల్లో పెడితే .. తదపురి వ్యూహం ఖరారు చేసుకోవాలనుకున్నారేమో కానీ ఇలా చేయడంపైనా అయన ఫైర్ అవుతున్నారు. మొత్తానికి చెవిరెడ్డి వేస్తున్న గంతులతో.. దొరికిన దొంగ అని సిట్ పోలీసులకూ అర్థమైంది.