2026 సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మకమైన 7వ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ (IREC)ని ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ ఎంపికైంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్–ఇండియా అధికారికంగా ఈ ప్రకటన వెల్లడించింది. హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ (HRA) సహకారంతో దీన్ని నిర్వహిస్తారు.
2015లో ప్రారంభమైన IREC, అమెరికా కేంద్రంగాఉండే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ అంతర్జాతీయ సమావేశంగా పేరు తెచ్చుకుంది. ఆసియాలోని ద్వైపాక్షిక వాణిజ్య సంఘాల సహకారంతో ప్రపంచ రియల్ ఎస్టేట్ నిపుణులను ఒకచోట చేరుస్తుంది. 2026 ఎడిషన్ హైదరాబాద్‌ను ప్రపంచ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు , ఆవిష్కరణల కేంద్రంగా ప్రమోట్ చేయనుంది.
2008లో స్థాపించిన NAR-INDIA, భారత రియల్ ఎస్టేట్ నిపుణుల కోసం అత్యున్నత సంస్థగా ఉంది. NAR గ్లోబల్‌తో అనుబంధంగా ఉంది. ఇది CREDAI, NAREDCO, నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లతో కలిసి పనిచేస్తుంది. IREC 2026ని ఆతిథ్యం ఇవ్వడం భారతదేశానికి ఒక మైలురాయి అనుకోవచ్చు. ఇది ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా దాని స్థానాన్ని బలోపేతం చేస్తుంది. రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ గుర్తింపును.. ప్రొప్టెక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెట్టుబడి వాతావరణాన్ని ప్రపంచం ముందు ఉంచే అవకాశం ఉంది.