వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోతాపురి మామిడితో ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు. కానీ అది మొత్తం ముందే లీక్ అయింది.జగన్ రాక ముందే రోడ్డు మీద మామిడికాయలను పోయాలని స్క్రిప్ట్ రాసుకున్నారు. కానీ అదో పెద్ద ప్రహసనంగా జరిగింది. అలాగే జగన్ రాక ముందు కాస్త అలజడి సృష్టించాలనుకున్నారు. కొంత మంది రౌడీలను తీసుకు వచ్చి.. అదే పని చేశారు. పోలీసుల్ని రప్పా రప్పా నరకుతామని బెదిరించారు. నినాదాలు చేసారు. తర్వాత జగన్ వచ్చారు. పోలీసులు ఇచ్చిన అనుమతిని వారు పట్టించుకోలేదు. మార్కెట్ యార్డ్ మొత్తం జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు దూరిపోయారు.
జగన్ రెడ్డి చుట్టూ తోపులాట జరిగేలా చూసుకున్నారు. ఆ తోపులాటలోనే తోతాపురి మామిడి కాయల మద్దతు ధర గురించి ఆవేశపడి.. తమ హయాంలో తిరుగులేని విధంగా ధరలు అందాయని చెప్పుకుని.. చేయగలిగినన్ని ఆరోపణలు చేసి వెళ్లిపోయారు. ఈ ఈవెంట్ కోసం భూమన దగ్గర నుంచి చాలా మంది భారీగా ఖర్చు పెట్టుకున్నారు కానీ.. అనుకున్న ఎఫెక్ట్ మాత్రం రాలేదు. అదంతా డ్రామా అని చూసే వాళ్లందరికీ అర్థమైపోయేలా ఈవెంట్ నిర్వహించారు.
జగన్ ఎక్కడికి వెళ్లినా తన కార్యకర్తలపై కేసులు బనాయించేలా చేసి వారిని బలి చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. బంగారుపాళ్యంలోనూ అదే చేశారు. పది రోజులుగా..ఈ ఈవెంట్ ను ఎలా రచ్చ చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. మార్కెట్ లో అమ్ముకోవాల్సిన కాయాలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి.. లారీలతో. ట్రాక్టర్లతో తొక్కించి రైతుల పంటకు విలువ లేకుండా చేశారు. జగన్ రెడ్డి తన దండయాత్రలతో ప్రజల్లో ఎలాంటి ముద్ర పడుతుందో తెలుసుకోకుండా.. అరాచకంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు.
ఈ పర్యటనలో ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ పై కొంత మంది దాడి చేశారు. దీంతో విషయం మరింత సీరియస్ అయ్యేలా ఉంది. పలువురు నేతలు, కార్యకర్తలు జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.