అందుబాటు ధరల్లో అపార్టుమెంట్లు ఎక్కడ ఉంటే అక్కడకు మధ్యతరగతి ప్రజలు వెళ్తున్నారు. ఆ ప్రాంతం కాస్త విద్య, ఉపాధి రంగాలకు దగ్గరగా ఉంటే చెప్పాల్సిన పని లేదు. అలాంటి ప్రాంతంగా కొల్లూరు మారుతోంది. కొల్లూరు ఒక వేగంగా అభివృద్ధి చెందుతున్న రెసిడెన్షియల్ ప్రాంతం, ఇది నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR)కి సమీపంలో ఉండటం , ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్‌లకు దగ్గరగా ఉండటం వల్ల ఆకర్షణీయంగా మారింది.
కొల్లూరులో బహుళ అంతస్తుల్లో అపార్ట్మెంట్ల సగటు ధర స్క్వేర్ ఫీట్‌కు రూ. 4,500 నుచి ప్రారంభమవుతోంది. లగ్జరీని బట్టి రూ. 8వేల వరకూ చెబుతున్నారు. స్థానిక బిల్డర్లు నిర్మిస్తున్న అపార్టుమెంట్లలో రూ. 45 లక్షలు నుండి రూ. 1.13 కోట్లు ధరలు చెబుతున్నారు. 1105 నుండి 1665 స్క్వేర్ ఫీట్ల వరకు ఈ అపార్టుమెంట్లు ఉంటున్నాయి. త్రిబుల్ బెడ్ రూం అపార్టుమెంట్లు కూడా రూ. 70 లక్షలు నుండి రూ. కోటిన్నర వరకూ లభిస్తున్నాయి.
కొల్లూరు ORR ఎగ్జిట్ 2కి సమీపంలో ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 10-15 నిమిషాల దూరంలో ఉంది. సమీపంలో సామస్తి ఇంటర్నేషనల్ స్కూల్, గౌడియం ఇంటర్నేషనల్ స్కూల్, బిర్లా ఓపెన్ మైండ్స్ వంటి విద్యా సంస్థలు ఉన్నాయి. తూర్పు ఫేసింగ్ లేదా కార్నర్ ఫ్లాట్లకు స్క్వేర్ ఫీట్‌కు రూ. 100 అదనపు ఛార్జీలు ఉండవచ్చు. 6వ అంతస్తు పైన ఉన్న ఫ్లాట్లకు కూడా అదనపు ఛార్జీలు విధిస్తున్నారు. రూ. 50 లక్షల నుండి రూ. 75 లక్షల బడ్జెట్ ఉన్నవారికి 2 BHK ఫ్లాట్లు అనుకూలం. రూ. 1 కోటి పైన బడ్జెట్ ఉన్నవారికి 3 BHK లేదా 4 BHK ఫ్లాట్లు ఎంచుకోవచ్చు.
చిన్న బిల్డర్లు, ఓ మాదిరి రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మించిన ప్రాజెక్టుల్లో రెడీ టు ఆక్యుపై ఫ్లాట్లు ఉన్నాయి. వాటి ధరలు ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఎంతో.. ఇప్పుడు కూడా దాదాపుగా అంతే చెబుతున్నారు. కొల్లూరు విద్య, ఉపాధి అందుబాటులో ఉండే ప్రాంతం అయితే.. కాస్త బడ్జెట్లో ఉన్న వారు ప్రయత్నించవచ్చని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.