ఆర్థిక మంత్రిగా పని చేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రస్తుతం పని చేస్తున్న పయ్యావుల కేశవ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటున్నారో.. రెస్ట్ తీసుకుంటున్నారో.. వైసీపీ కుట్రల బ్యాక్ ఆఫీస్ ను అక్కడి నుంచే నడుపుతున్నారో కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ క్లబ్లో ప్రెస్మీట్లు పెట్టి ఆర్థికపరమైన అంశాలపై ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మార్కెట్లో విక్రయిస్తున్న బాండ్లపై ఆరోపణలు చేస్తున్నారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో ఏపీకి అప్పులు, పెట్టుబడులు రాకుండా ఓ మిషన్ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. అప్పులు ఇచ్చే ఆర్థిక సంస్థలకు లేఖలు రాయడం, బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారిని బెదిరించడం, ఏపీలో పరిశ్రమలు పెట్టాలనుకున్న వారికి మళ్లీ జగన్ వస్తాడని హెచ్చరించడం వంటివి చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వక్క సీక్రెట్ గానే చేస్తూ వచ్చారు. కానీ ఇటీవల బయటపడ్డాయి. ఇలా దేశం బయట ఉండి.. దేశంపై తప్పుడు సమాచారంతో దాడి చేస్తున్న వారిపై దేశద్రోహం కేసు పెడతామని అనగానే బుగ్గన తెరపైకి వచ్చేశారు.
బుగ్గన బాధ అంతా.. ఎన్ని చేసినా పెట్టుబడులు, అప్పులు ఆపలేకపోతున్నామనే. గతంలో బేవరేజెస్ బాండ్లను అమ్మకానికి పెడితే ఒక్కరూ కొనలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పెడితే ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. అది బుగ్గన తట్టుకోలేకపోతున్నారు. అలాగే ఇతర పెట్టుబడులు కూడా అంతే. ఎన్ని కుట్రలు చేసినా ఆగడం లేదు. అందుకే ప్రెస్మీట్లు పెట్టి ఆవేశపడిపోతున్నారు. దానికి పయ్యావుల కౌంటర్ ఇస్తున్నారు. తప్పుడు మార్గాల్లో ప్రయత్నించి గతంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయింది.ఇప్పుడు చట్టబద్ధంగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పాలకులపై ఇన్వెస్టర్లలో నమ్మకం కూడా ఉండాలి. ఆ విషయం బుగ్గనకు తెలియదని అనుకోలేం.