సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ రాజమౌళి ఆస్థాన టెక్నిషియన్. రాజమౌళి సినిమా అంటే సెంథిల్ కెమరామేన్ అని ఫిక్స్ అయిపోవచ్చు. పైగా బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో దాదాపు పదేళ్లు జక్కనతో ఉన్నాడు సెంథిల్. అయితే మహేష్‌తో చేస్తున్న సినిమాకి మాత్రం సెంథిల్ని పక్కన పెట్టారు రాజమౌళి. సెంథిల్ కూడా అనూహ్యంగా జూనియర్, నిఖిల్ స్వయంభూ లాంటి సినిమాలకి షిఫ్ట్ అయ్యారు.
ఈ గ్యాప్ గురించి ఇండస్ట్రీ చర్చ జరిగింది. తాజాగా సెంథిల్ తన వెర్షన్ వినిపించాడు. ఈ గ్యాప్‌కి షాక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ‘‘రాజమౌళి గారు నేను వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఉండేది. విక్రమార్కుడు, మర్యాద రామన్న నేను చేయలేదు. దీనికి షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కుదరలేదు. మరో ప్రాజెక్ట్‌కి మళ్లీ మేము కలిసి పని చేస్తాం’’ అని చెప్పుకొచ్చాడు సెంథిల్.
సెంథిల్ డీవోపీగా చేసిన జూనియర్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే నిఖిల్‌తో స్వయంభూ, ఇండియన్ హౌస్ సినిమాలు చేస్తున్నాడు. తనకి దర్శకత్వంపై కూడా ఆసక్తి ఉంది. కొన్ని కథలు సిద్ధం చేస్తున్నాడు. అయితే దర్శకుడిగా మారడానికి ఇంకా సమయం కావాలని చెప్పుకొచ్చాడు.