ముద్రగడ పద్మనాభరెడ్డికి తీవ్ర అస్వస్థత ఏర్పడటంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. వారు హైదరాబాద్ తీసుకెళ్లడం మంచిదని సలహా ఇవ్వడంతో రాత్రికి రాత్రి హైదరాబాద్ తీసుకు వచ్చి.. యశోదా ఆస్పత్రిలో చేర్పించారు.
కొద్ది రోజుల కిందట.. ప్రెస్ మీట్ పెట్టిన ముద్రగడ .. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని వయసు కారణంగా వచ్చిన సమస్యలకు తన కుమారుడు జాగ్రత్తగా వైద్యం అందిస్తున్నారని చెప్పారు. అయితే ఆయన చాలా రోజులుగా బయటకు రావడంలేదు. ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన కుమార్తె క్రాంతి .. తన తండ్రికి సరైన వైద్యాన్ని అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కుటుంబంలోనూ రాజకీయాల కారణంగా పంతాలకు పోయి విబేధాలు పెట్టుకున్న ముద్రగడ.. తన కుమార్తెతో సంబంధం లేదని ప్రకటించారు. తనను చూడటానికి రావాల్సిన అవసరం.. తన కుమారుడు తనను బాగా చూసుకుంటున్నాడని ప్రకటించారు.
ముద్రగడకు క్యాన్సర్ ఉందని.. క్రాంతి చెబుతున్నారు. అవసరమైన వైద్యాన్ని అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తండ్రి, కుమార్తెల్ని కలిపేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. గత ఎన్నికలకు ముందు ముద్రగడ కుమార్తె జనసేనలో చేరారు. ముద్రగడ వైసీపీలో చేరారు. అంతకు ముందు నుంచే వియ్యంకులతో ముద్రగడ వివాదాలు పెట్టుకున్నారు. వారితో సంబంధాలు తెంచుకున్నారు.