మేము తప్పు చేయలేదని కడిగిన ముత్యంగా మిథున్ రెడ్డి బయటకు వస్తాడని ఆయన తండ్రి.. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డి పై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందన్నారు. గతంలో ఎయిర్ పోర్ట్ మేనేజర్ ను కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టారన్నారు. ఆ కేసు నిలబడలేదు, ఇప్పుడు ఈ కేసు కూడా నిలబడదన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.
ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని మదనపల్లి ఫైల్స్, ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు అని కేసులు పెట్టారన్నారు. మాపై ఏమీ లేదని తేలిపోయిందన్నారు. మిథున్ రెడ్డి .. జగన్ మోహన్ రెడ్డి తో సఖ్యత గా ఉన్నాడని తప్పుడు కేసు పెట్టారన్నారు. ఇది కూడా తప్పుడు కేసుగా మిగులుతుందని.. చంద్రబాబు రాజకీయ జీవితంలో తీరని మచ్చ మిగులుతుందని హెచ్చరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ను గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. బంగారు పాళ్యం మార్కెట్ యార్డు పర్యటన సందర్భంగా ముగ్గురు ఎస్పీలతో అణచి వేయాలని చూశారన్నారు. హామీలు అమలు చేయలేదన్నారు. మహిళలు, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు ఈ విధంగా తప్పుడు కేసులు తో ప్రతి పక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, ప్రజలు దృష్టి మరల్చుతున్నారని ఆరోపించారు. వైసీపీకి కీలక నేతగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.