బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న కవిత కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నాలు చేయడానికి ముందే హైదరాబాద్ లో దీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి వచ్చే నెల 5 వతేదీ నుంచి ఏడో తేదీ వరకు వివిధ రూపాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేయనున్నారు. కవిత ఒక రోజు ముందుగానే నాలుగో తేదీన ప్రారంభించి ఆరో తేదీ వరకూ దీక్ష చేస్తారు. గతంలో ఆమె రైల్ రోకోను ప్రకటించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చారని చెప్పి వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఏదీ కన్ఫర్మ్ కాకపోవడంతో దీక్షకు దిగారు.
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమిళనాడులో గవర్నర్ జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు..రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్ద పెండింగ్ అంశంపై కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్,బీజేపీకి ఉన్న ఒప్పందంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం లేదని.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్,రాష్ట్రపతి వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే మంచి తీర్పు వచ్చిందని గుర్తు చేశారు.
మేము వెళ్లి ధర్నా చేస్తాము ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు రావాలని పొన్నం ప్రభాకర్ అంటున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫీషియల్ గా అఖిలపక్షంను ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షం ఢిల్లీకి రావాలని ఎమ్మెల్యేలు,ఎమ్మెల్యేలు,అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయాలన్నారు. బీజేపీ బీసీ సీఎం,బీసీ పీఎం అని అంటున్నారు కానీ.. బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్రమంత్రులు ఉన్నా ప్రయోజన శూన్యమని విమర్శించారు. తన దీక్షకు ప్రభుత్వ అనుమతి కోరి నిరాహారదీక్ష చేస్తాం.. ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహారదీక్ష కు దిగుతామని ప్రకటించారు. తాను గతంలో అంబెడ్కర్ విగ్రహ సాధన కోసం నేను 72 గంటలు దీక్ష చేస్తే.. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు.
కవిత కాంగ్రెస్ పార్టీకి సలహాలిచ్చేలా పోరాటాలు చేస్తున్నారు. బీజేపీని మాత్రం విమర్శిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమెవన్నీ క్రెడిట్ రాజకీయాలని.. తమతో వచ్చి ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.