జగన్ రెడ్డి బెదిరించి కేసుల్ని నిలుపదల చేసుకోవాలని చూస్తున్నారు. యాప్ తెస్తున్నామని.. అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తామని అంటున్నారు. ప్రస్తుతం తాము అనుభవిస్తున్న పవరాఫ్ చట్టం అనే సినిమాను ఆపేయాలనే ఆయన బెదిరింపులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐదు సంవత్సరాల పాటు అడ్డగోలుగా చేసిన దోపిడీ, అరాచకాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటూంటే.. మేము వచ్చాక సినిమా చూపిస్తామని.. ఎగరేసి తంతామని రోజా వంటి వాళ్లతో చెప్పిస్తున్నారు. ఆయన కొత్తగా యాప్ తీసుకు వస్తామని అందులో అందరూ నమోదు చేసుకుంటే.. అధికారంలోకి వచ్చాక అది ఓపెన్ చేసి ఒక్కొక్కరి సంగతి చూద్దామని కొత్త సలహా ఇచ్చారు.
ఈ యాప్లో మొదట జగన్ రెడ్డే తన పేరు నమోదు చేసుకుని తనపై కేసులు పెట్టారని రాసుకుంటారేమో కానీ.. అరెస్టు అయిన వారంతా జగన్ రెడ్డి కోసమే అరెస్టు అయ్యారు. ఆయన చేసిన అవినీతిలో భాగం అయి అడ్డంగా దొరికిపోయి అరెస్టయ్యారు. ఇంకా తప్పుడు పనులు చేసిన చాలా మంది బయటే ఉన్నారు. మెల్లగా అన్ని వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటన్నింటినీ బయట పెడితే ప్రతి నేరానికి డెస్టినేషన్ తాడేపల్లినే అవుతుంది. అందుకే జగన్ రెడ్డి కంగారు పడుతున్నారు.
అధికారం ఉందని అడ్డగోలు పనులు చేసిన వారే ఇప్పుడు భయపడుతున్నారు. వారే పరారీలో ఉన్నారు. కింది స్థాయి వైసీపీ సామాన్య కార్యకర్తలు..అంతా హ్యాపీగానే ఉన్నారు. జగన్ రెడ్డికి ఈ విషయం తెలుసు. అన్నీ కేసులు తన వల్లే కాబట్టి ఆయన అవి తన వద్దకు వస్తాయని భయపడుతున్నారు. అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తామంటున్నారు. కానీ చట్ట ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న కేసుల సినిమా మాత్రం ఆగే అవకాశం లేదు. చట్టం, న్యాయం, వ్యవస్థల పవర్ ఏంటో జగన్ రెడ్డి చూస్తూనే ఉంటారని టీడీపీ వర్గాలంటున్నాయి. తాటాకు చప్పుళ్లకు సినిమా ఆగదని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నాయి.