ఎంతో నమ్మకంతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి రక్త మాంసాలను పీల్చేయడానికి గత పాలకులు వాడిన వైనం వెలుగులోకి వస్తున్న కొద్దీ ప్రజలు దిగ్భ్రాంతికి గురవ్వాల్సి వస్తోంది. పూర్తిగా నగదు లావాదేవీలు చేస్తూ వేల కోట్లను చలామణి చేశారు. ఇదంతా అక్రమం. అన్యాయం. అనైతికం. కోర్టుల్లో ఏడుపులు ,పెడబొబ్బలు.. బయటకు వచ్చిన బెదిరింపులు చేసే ఈ నాయకుల వ్యవహారం మొత్తం వీడియోల్లోనే బయటపడుతోంది.
ఒక్కటి కాదు.. వందల వీడియోలు
చెవిరెడ్డికి సన్నిహితుడు అయిన వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి క్యాష్ హ్యాండ్లర్ గా పని చేశాడు . అతను వచ్చిన డబ్బుల్ని లాండరింగ్ చేసేవాడు. ఎంత చేస్తున్నాడు.. ఎవరికి చేస్తున్నాడు అన్నది తమ ఫోన్లోనే వీడియోలు తీసి చెవిరెడ్డికి పంపేవాడు. వెంటనే డిలీట్ చేసేవాళ్లు. కానీ ఓ సారి వీడియో తీస్తే.. ఎలాగైనా దాన్ని బయటకు తీసే టెక్నాలజీ ఉంది. ఇప్పుడు అన్నీ బయటకు తీస్తున్నారు. ఒక్క వీడియో వెలుగులోకి వచ్చింది. ఇంకా ఎన్నో వీడియోలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. అవన్నీ సిట్ అధికారులు వెలికి తీసి ఉంటారు.
ఆర్బీఐలో జమ కాని రూ.6 వేల కోట్ల రూ.2వేల నోట్లన్నీ అక్కడే ?
రిజర్వేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. కానీ 98 శాతం మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. ఇంకా ఆరు వేల కోట్లకుపైగా విలువైన రూ.2 వేల నోట్లు ఆర్బీఐకి రాలేదు. వీటిని ఆర్బీఐ కేంద్రాల్లో మార్చుకోవచ్చని ప్రకటించింది. కానీ మార్చుకుంటే..ఎవరు మార్చుకున్నారు…ఎక్కడి నుంచి వచ్చాయన్నది తెలిసిపోతుంది. అధికారం పోవడంతో ఎందుకైనా మంచిదని వాటిని డెన్లలోనే ఉంచుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అది డబ్బు కాదు..ప్రజల రక్త మాంసాలు!
లిక్కర్ స్కాంలో సంపాదించింది డబ్బు కాదు. ప్రజల రక్త మాంసాలు. భారీగా ధరలు పెంచి.. చీప్ లిక్కర్ తీసుకు వచ్చి.. సొంత మద్యం అమ్మి.. అందులోనూ ట్యాక్స్ కట్టని మద్యం అమ్మి వేల కోట్లు వెనకేశారు. ప్రజల రక్త మాంసాలు పీల్చారు. వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడారు. వీరి డబ్బు కక్కుర్తి వల్ల వేల కుటుంబాలు నాశనమైపోయాయి . ఇప్పుడు వారి ఉసురు తగలడం ఖాయంగా కనిపిస్తోంది.