ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో అడ్డంగా దొరికిపోయి… ప్రజల ముందు రోజూ నగ్నరంగా నిలబడుతున్నప్పటికీ.. వైసీపీ నేతలకు అసలు సినిమా అర్థం కావడం లేదు. తమను నమ్మే బకరాలు ఉంటారని.. వారిని నమ్మించేందుకు వెబ్స్టోరీలు చెబితే సరిపోతుందని అనుకుంటున్నారు. ఈ క్రమంలో సాక్షి పత్రికలో వారు చేస్తున్న విచిత్ర విన్యాసాలతో అసలు బిగ్ బాస్ జగనేనని అందిరకీ అర్థమయ్యేలా చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. జగన్ ప్రేమేయం లేకపోతే ఇంత ఘోరంగా.. తప్పుడు వాదనలతో లిక్కర్ కేసును డిఫెండ్ చేసేందుకు ప్రయత్నిస్తారా ?
బయటపడే ప్రతి సాక్ష్యానికి విచిత్రమైన వర్ణనలు
లిక్కర్ స్కామ్లో చేసింది చిన్న మొత్తం లావాదేవీలు కావు. పైగా అధికార అహంకారం నెత్తికెక్కి.. ఎప్పటికీ అధికారం శాశ్వతం అనే భావనలో ఉండి బహిరంగ దోపిడీ చేశారు. నోట్ల కట్టలతో వీడియోలు తీసుకున్నారు. లెక్కలేనన్ని తప్పులు చేశారు. ఓడిపోయాక అన్నీ డిలీట్ చేసేశామని అనుకున్నారు. కానీ ఒక్క సారి రికార్డు చేస్తే ఎరేస్ చేసినా.. తీసుకొచ్చే టెక్నాలజీలు వచ్చాయన్న సంగతిని మర్చిపోయారు. ఇపుడు ఆ వీడియోలకు వింత నేరేటివ్స్ ఇస్తున్నారు. సాక్షి మీడియాలో వస్తున్న ఆ కథనాలు పడుతున్న అపసోపాలు చూస్తే.. బిగ్ బాస్ కు దడ పట్టుకుందని ఎవరికైనా అనిపించడం ఖాయం.
లిక్కర్ స్కామ్ లేదంటారు.. మళ్లీ నిందితులు టీడీపీకి సన్నిహితులంటారు !
లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్పేందుకు సాక్షి మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. దర్యాప్తు సంస్థ చేసే ప్రతి పనిని అడ్డగోలుగా విమర్శిస్తోంది. ఎన్నికల సమయంలో చెవిరెడ్డి తెప్పిస్తూ పట్టుబడిన ఎనిమిదిన్నర కోట్ల నుంచి…తాజాగా ఫామ్ హౌస్ లో పట్టుబడిన నగదు వరకూ అంతా సాక్షి నాయకత్వంలోనే ఎదురుదాడికి దిగుతోంది. నిందితులు టీడీపీకి సన్నిహితులని వాదిస్తోంది. అసలు లిక్కర్ స్కామ్ జరగలేదని వాదిస్తారు. మళ్లీ నిందితులు టీడీపీ నేతలనే ముద్ర వేసేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేయరు. ఎప్పుడో..ఏదో సందర్భంలో వెంకటేష్ నాయుడు పెమ్మసానితో ఫోటో దిగితే.. రచ్చ చేస్తున్నారు. జగన్ రెడ్డితో కలిసి అంటకాగింది మాత్రం.. చెప్పడం లేదు. అంటే వివేకా హత్య కేసులో ఎలాంటి వ్యూహాన్ని రచించారో అలాంటిదే అమలు చేస్తున్నారన్నమాట. అయితే స్కామ్ జరగలేదని నమ్మించడం.. తప్పనిసరి అంటే.. టీడీపీ వాళ్లే చేశారని బురద చల్లేయడం.
బిగ్ బాస్ ఎవరో చెప్పాల్సిన పని లేదు.. సాక్షి చూస్తే చాలు !
సాక్షి పత్రిక, టీవీ జగన్ రెడ్డి కోసమే పని చేస్తాయి. ఆ విషయం ఆయన తల్లి, చెల్లిని ఇంటి నుంచి గెంటేసి.. ఆస్తులు లాగేసుకున్న సందర్భంలోనూ బయటపడింది. తల్లి, చెల్లిపై కూడా చంద్రబాబు ముద్ర వేసేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. అలాంటిది…. జగన్ వ్యవహారం బయటకు ఇస్తుందన్న భయం ఉండబట్టే లిక్కర్ కేసు నిందితుల్ని డిఫెండ్ చేస్తున్నారు. జగన్ కు సంబంధం లేకుండా చేసిన దోపిడీ అయితే.. సాక్షిలో వేరే కథనాలు వచ్చేవి. సాక్షి లో వస్తున్న కథనాలు చూస్తూనే.. జగన్ రెడ్డి ఈ కేసులో బిగ్ బాస్ అని సులువుగా అర్థం చేసుకోవచ్చు.