మంత్రి పదవి రాకపోవడానికి సీఎం రేవంత్ రెడ్డే కారణం అని కోమటిరెడ్డి గట్టిగా ఫిక్సయ్యారు. అందుకే తాను ఆయనకు వ్యతిరేక గ్రూపులో కీలకంగా ఉంటానని సంకేతాలు పంపుతున్నారు. విపక్షాలపై ఆయన ఏమైనా విమర్శలు చేస్తున్నారో లేదో కానీ ముందుగా రేవంత్ రెడ్డికి మాత్రం ప్రతీ దానికి కౌంటర్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. పదేళ్లు తానే సీఎం రేవంత్ గతంలో మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చారు. తాజాగా రాజకీయాలతో సంబంధం లేకపోయినా జర్నలిస్టుల విషయంలో రేవంత్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు.
రెండు రోజుల కిందట ఓ పత్రికకు సంబంధించిన వేడుకలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో జర్నలిస్టులుగా చెలామణి అవుతూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న వారిపై మండిపడ్డారు. ఆయన మాటలు వైరల్ అయ్యాయి. జర్నలిజం వర్గాల్లోనూ రేవంత్ మాట్లాడింది కరెక్టేనని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఆ సోషల్ మీడియా జర్నలిస్టులకుగా మద్దతుగా వచ్చారు. వారిపై అలా మాట్లాడం సరి కాదని రేవంత్ పేరు ఎత్తకుండానే రాసుకొచ్చారు.
నిజానికి ఆ జర్నలిస్టులు కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎన్నెన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో వారికీ తెలుసు. వారిపై నిందలేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే డిఫెండ్ చేశారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి .. వారికి మద్దతుగా వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం ఆ సోషల్ మీడియా జర్నలిస్టులు .. కోమటిరెడ్డి బ్రదర్స్ ను మావోళ్లే అనుకోరు. కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ సోషల్ మీడియాకూ దూరమవుతారు. అయినా సరే రేవంత్ పై తన వ్యతిరేకత వ్యక్తం చేయడానికి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.