ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా చాలా మంది చనిపోతున్నారని .. రష్యాతో వ్యాపారం చేసే వాళ్లపై టారిఫ్లు వేస్తామని ట్రంప్ బెదిరిస్తున్నారు. అన్నంత పని చేస్తున్నారు. అయితే అమెరికాకు అవసరమైన వాటిని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటూనే ఉన్నారు. అది వేరే సంగతి. అసలు ఉక్రెయిన్ గురించే ఎందుకు మాట్లాడుతున్నారు. గాజాలో పోతున్న ప్రాణాల గురించి ఎందుకు లైట్ తీసుకుంటున్నారు. పైగా అక్కడ జరుగుతోంది నరమేథం కాదని అనేస్తున్నారు. ఇక్కడే ట్రంప్ మానసిక స్థితి అర్థం అయిపోతుంది.
గాజాలో జరుగుతోందని అచ్చమైన నరమేథం. ఎలాంటి యుద్ధంలో అయినా ప్రజల జోలికి వెళ్లకూడదన్న నీతి ఉంది. ఇది ఒప్పందాల్లో కూడా ఉంటుంది.కానీ గాజాలో ప్రజల్నే లేకుండా చేయాలన్న ఉద్దేశంతో నరమేథం చేస్తున్నారు. ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతిస్తోంది. అమెరికా సపోర్టుతో అక్కడి ప్రజల్ని నిర్మూలిస్తున్నారు. పారిపోయిన వారు పారిపోవాలి లేకపోతే చనిపోవాలన్నట్లుగా పరిస్థితి మారింది. ఆకలితో అయినా చంపేందుకు వెనుకాడటం లేదు. అక్కడ జరుగుతున్నది బయట ప్రపంచానికి తెలిసింది కొంతే. ఒక్క ప్రాంతం కోసం ఇంత మందిని చంపుతూంటే.. ట్రంప్ మాత్రం అది నరమేథం కాదంటున్నారు.
అమెరికా అంటే రక్త పీపాసి. ఆయుధాలను అమ్ముకోవడానికి దేశాల మధ్య వివాదాలను సృష్టించి యుద్ధాలను ప్రోత్సహిస్తుంది. మళ్లీ తామే రాజీ చేస్తుంది. ఇప్పుడు ఉక్రెయిన్ లేకుండానే.. రష్యాతో శాంతి చర్చలు జరుపుతానంటూ ట్రంప్ బయలుదేరారు. అసలు ఉద్రిక్తతలు రష్యా, ఉక్రెయిన్ మధ్య అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు లేకుండా ట్రంప్ ఏం చర్చిస్తారు ?. తాను చెప్పినట్లుగా జెలెన్ స్కీం చేయకపోతే.. టారిఫ్లు వేస్తా.. సాయం ఆపేస్తానని బెదిరించడం తప్ప ట్రంప్ ఏమీ చేయరు.
అసలు ఉక్రెయిన్ కు ఈ దుస్థితి రావడానికి అమెరికా కారణం. రష్యాకు వ్యతిరేకంగా ఎగదోసి.. రష్యా దాడి చేస్తే పక్కకెళ్లిపోయారు. ఆ దేశాన్ని .. దేశ పౌరుల్ని బలి చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.