బీఆర్ఎస్ పార్టీలోనే వివాదాలు ఉన్నట్లుగా మీడియా ప్రచారం చేస్తోందని కల్వకుంట్ల కవిత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీల్లోనూ వివాదాలు ఉన్నాయని గుర్తు చేశారు. సింగరేణికి సంబంధించి తన పట్టును నిరూపించుకోవడం కోసం కవిత జాగృతి విభాగాన్ని, మరో కార్మిక సంఘంతో అనుబంధానం చేశారు. బీఆర్ఎస్ అధికారిక కార్మిక సంఘాన్ని పక్కన పెట్టేశారు. బీఎంఎస్ కార్మిక సంఘంతో సమావేశమైన తర్వాత కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం నడుస్తోందని .. సీఎం రేవంత్‌రెడ్డి ఏదైనా మాట్లాడితే.. అరగంటలోనే రాజగోపాల్‌రెడ్డి ఖండిస్తున్నారని కవిత అన్నారు. అలాగే బండి సంజయ్‌కు డైరెక్ట్‌గా ఈటల వార్నింగ్ ఇస్తున్నారన్నారు. అన్ని పార్టీల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. BRSపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కవిత తాను బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యానని ఏ మాత్రం అంగీకరించడం లేదు. తాను పార్టీలోనే ఉన్నానని చెప్పుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే కవితకు బీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆహ్వానించడం లేదు. కవిత కూడా వారు పిలవడం లేదని ఫీల్ కావడం లేదు. తన జాగృతి తరపునే రాజకీయం చేస్తున్నారు. కానీ తన పార్టీ బీఆర్ఎస్ అంటున్నారు. జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటించే వరకూ ఇలాగే చేస్తారని బీఆర్ఎస్ నేతలంటున్నారు.