అరిచే కుక్క కరవదని ఓ సామెత ఉంటుంది. రోడ్డుపై పోయేటప్పుడు ఏదైనా కుక్క అరుస్తూ ఉంటే.. అది బెదిరించడానికే ప్రయత్నిస్తుందని అర్థం. దాన్ని అదిలిస్తే కంటికి కనిపించకుండా పారిపోతుంది. కానీ కరవాలనుకునే కుక్క మాత్రం .. సైలెంటుగా వచ్చి పిక్క పట్టేసుకుంటుంది. ఈ సూత్రం కుక్కల విషయంలోనే కాదు.. అందరికీ వర్తిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్‌కూ వర్తిస్తుంది.
అదే పనిగా అరుస్తున్న మనీర్
ఉగ్రవాదులను రెచ్చగొట్టి వారికి సాయం చేసి.. పెహల్గాం ఉగ్రదాడి జరిగేలా చేసిన మనీష్.. తమ దేశ సైనిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టారు. భారత్ చేసిన దాడులతో పాకిస్తాన్ పరిస్థితి ఘోరంగా మారింది. ఎయిర్ బేసులు ధ్వంసం అయితే వాటిని బాగు చేసుకోలేకపోతున్నారు. కానీ ఆయనకు మాత్రం మార్షల్ హోదా ఇప్పించుకున్నారు. కావాలంటే ప్రభుత్వాన్ని పడగొట్టి అయినా తానే మరో ముషారఫ్ లా మారతానన్న సంకేతాలు ఇస్తున్నారు. తన చేతుల్లో లేని అణుబాంబు గురించి పదే పదే మాట్లాడుతున్నారు.
సగం ప్రపంచాన్ని నాశనం చేస్తారట – అసలీ ఆలోచన ఎలా ?
పాకిస్తాన్ ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో.. మునీర్ అనే ఈ పాకిస్తాన్ సైన్యం పెద్ద తలకాయ మాటలతోనే అర్థ మైపోతుంది. అసలు ప్రపంచాన్ని నాశనం చేయాలనే ఆలోచన ఎందుకు రావాలి?. ప్రపంచంలో చాలా దేశాలు అణు సామర్థ్యం కలిగి ఉన్నాయి కానీ ఒక్క దేశం కూడా దాన్ని ప్రపంచాన్ని నాశనం చేయడానికి రెడీ చేస్తున్నామని చెప్పలేదు. అణు ఆయుధాలను కేవలం తమ భరోసా కోసమే అన్న సంకేతాలు ఇస్తున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం సగం ప్రపంచాన్ని నాశనం చేయగలమని బెదిరిస్తోంది.
అసలు పాక్ అణు సామర్థ్యం అంతే చైనా, అమెరికా గుప్పిట్లోనే !
పాకిస్తాన్‌కు చైనా సపోర్టు ఉంది. ఇప్పుడు భారత్ ను బ్లాక్ మెయిల్ చేయడానికి అమెరికా కూడా సహకరిస్తోంది. అందుకే పాకిస్తాన్ మొరగడం ప్రారంభించింది. కానీ ఆ రెండు దేశాలకు భారత ప్రాధాన్యం ఏమిటో తెలుసు. పాకిస్తాన్ ను అడ్డంగా ప్రోత్సహించి భారత్ ను నియంత్రించాలని చూస్తున్నాయి. కానీ అసలైన సమయంలో ఆ దేశాలు.. పాకిస్తాన్ ను నిండా ముంచుతాయి. అప్పటి వరకూ పాకిస్తాన్ మొరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాతే అసలు సినిమా ప్రారంభమవుతుంది.