జగన్మోహన్ రెడ్డి బీజేపీ నేతల కంటే ఎక్కువగా .. ఆ పార్టీ పెద్దలను కాకా పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీ మూల పురుషుల్ని పొగిడేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టడం లేదు. శనివారం వాజ్ పేయి పుట్టిన రోజు. ఈ అవకాశాన్ని జగన్ వదులుకోలేదు. తన ఆస్థాన రచయితలతో క్లుప్తంగా గొప్పగా రాసి పోస్టు చేశారు. ఈ పోస్టు చూసిన వాళ్లకు పాపం జగన్ కు ఎంత కష్టం వచ్చిందని అనుకుంటున్నారు.
ఓ వైపు ఓటు చోరీపై రాహుల్ గాంధీ మాట్లాడాలంటారు. ఏపీలో పన్నెండు శాతానికిపైగా ఓట్ల తేడా ఉందంటారు. కానీ ఆయన మాత్రం మాట్లాడరు. కనీసం బీజేపీని , ఈసీని ప్రశ్నించే ప్రయత్నం చేయరు. సరి కదా బీజేపీతో హాట్ లైన్ లో అందుబాటులో ఉంటారని.. కాళ్లు పట్టేసుకుని వదలట్లేదన్న విమర్శలను నిజం చేస్తూ ఇలా స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు.. తనను ఎక్కడ జైలుకు పంపుతారోనని భయపడుతున్నారు. తనను బీజేపీ హైకమాండ్ మాత్రమే రక్ఖిస్తుందని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఆయన ఈ తరహా రాజకీయం చేస్తున్నారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఆ కూటమిపై పోరాడాలి. కానీ ఆయన ఎవరిపై పోరాడుతున్నారో ఆయనకు అర్థం కావడం లేదు. కేవలం టీడీపీ జనసేనపై పోరాడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. ఏ విషయంలోనూ బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. కాంగ్రెస్ ను బూచిగా చూపి.. బీజేపీ ఆదుకోకపోతే ఆ పార్టీతో వెళ్తామని ఢిల్లీ ధర్నా ద్వారా బెదిరించే ప్రయత్నం ఫెయిల్ కావడంతో ఇప్పుడు రివర్స్ లో బీజేపీని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు వచ్చిన కష్టం ఏ రాజకీయ నేతకు రాకూడదని క్యాడర్ కూడా నొసటితో నవ్వుకుంటున్నారు.