బాలీవుడ్ కి కొత్త జోష్ ని తీసుకొచ్చింది మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్. ఈ సిరీస్‌లో వచ్చిన స్త్రీ, భేడియా, ముంజ్య, స్త్రీ 2 బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను చూశాయి. ఇప్పుడు అదే యూనివర్స్‌లో వస్తున్న కొత్త సినిమా ‘థామా’. రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న సినిమా ఇది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను వదిలారు.
అతీంద్రియ శక్తులతో కూడిన ఓ రొమాంటిక్ కామెడీ ఇది. హారర్, రొమాన్స్, లవ్ అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. రష్మిక గెటప్ కొత్తగానే ఉంది. మాడాక్ హారర్-కామెడీ లో వస్తున్న ఫస్ట్ లవ్ స్టోరీ ఇది. రష్మిక, ఆయుష్మాన్ ప్రేమకథ ఇందులో కీలకం.
రష్మిక హారర్ టచ్‌లో ఉన్న కథలో కనిపించడం ఇదే తొలిసారి. రష్మిక లక్ బావుంది. ఆమె చేసిన దాదాపు సినిమాలు విజయాన్ని సాధిస్తున్నాయి. మాడాక్ నిర్మించిన సినిమాలకీ మంచి క్రేజ్ ఉంది. పాజిటివ్ బజ్ వున్న ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.