హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు భూమి తరలే గుదిబండలుగా మారాయన్న అభిప్రాయం వినిపిస్తున్న సమయంలో ప్రభుత్వం మరింత ఎక్కువగా ధరలు పెరిగే విధంగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) భూముల వేలానికి ప్రాథమిక ధరను చాలా ఎక్కువగా నిర్ణయించారు. కోకాపేటలో గజానికి రూ. 1,75,000గా HMDA నిర్ధారించింది. వేలంలో పాల్గొనేవారు ప్రాథమికంగా ..ఈ ధర నుంచి ప్రారంభం కావాలి. ఇది మూడు లక్షలకు దాటిపోవచ్చు. లకూడా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరానికి రూ. 100 కోట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దక్కించుకున్నారు. ఇప్పుడు గజాల లెక్కల ప్రభుత్వం వేలం వస్తోంది.
హెచ్ఎండీఏ సెప్టెంబర్ 17-19 తేదీల్లో హైదరాబాద్ శివార్లలోని వివిధ ప్రాంతాలలో 93 ప్రైమ్ ప్లాట్లను ఈ-వేలం ద్వారా నమ్ముతోంది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, మెదక్ జిల్లాల్లోని కోకాపేట, తుర్కాయంజల్, బచుపల్లి, చందనగర్, పుప్పలగూడ, ఇతర ప్రాంతాలలో 93 ప్లాట్లు ఉన్నాయి. తుర్కాయంజల్ లో 12 ప్లాట్లు, బాచుపల్లిలో 70 ప్లాట్లు, నల్లగండ్ల, బైరాగిగూడ, మంచిరేవుల, పీరంచెరువు, అమీన్పూర్, వెల్మల, పటాన్చెరు, బౌరంపేట్, సురారం, చెంగిచెర్లతో కోకాపేటలో ఈ భూములు ఉన్నాయి.
కోకాపేటను వేరే యూనివర్శ్ స్థాయిలో ధరను నిర్ణయించగా.. తుర్కాయంజల్ , బాచుపల్లిలో కనీస అప్సెట్ ధర గజానికి రూ. 25,000 నుండి రూ. 35,000 వరకు నిర్ణయించారు. నల్లగండ్లలో గజానికి రూ. 1,50,000, చందానగర్ లో రూ. 1,00,000, అమీన్పూర్, పటేల్‌గూడ, మూసాపేటలో రూ. 70,000గా నిర్ణయించారు. ప్లాట్లు 290 చ. గజాల నుండి 9,680 చ. గజాల వరకు వివిధ పరిమాణాలలో ఉన్నాయి .
ప్రభుత్వం ఆదాయం కోసం ఇలా అత్యధిక ధరలకు భూములను వేలం వేస్తూండటంతో ఇతర ప్రాంతాల్లోనూ ఇదే బేస్ చేసుకుని ధరలు పెంచుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగా ఇళ్ల రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా డిమాండ్ తగ్గుతోంది.