విజయసాయిరెడ్డి విషయంలో తీవ్రంగా వివాదాస్పదమైన దేవాదాయశాఖ ఉద్యోగిని శాంతిపై విచారణ పూర్తి అయింది. ఆమెను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలని ఉన్నతాధికారులు సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. వృత్తిపరంగా ఆమె తీవ్రమైన అవినీతికి పాల్పడటంతో పాటు వ్యక్తిగత జీవితం విషయంలోనూ ఆమె తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తించారు.
వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పని చేసి.. విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా చేశారు. అలాగే తనకు చాన్స్ ఉన్న చోటల్లా ఆలయాల భూముల విషయంలో అవినీతికి పాల్పడ్డారు. ఈ వివరాలన్నీ ప్రభుత్వం మారిన తర్వాత బయట పడ్డాయి. ఆమె భర్త.. తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య బిడ్డను కన్నదని దానికి విజయసాయిరెడ్డే కారణం అని ఆరోపించడం సంచలనం అయింది.
ప్రభుత్వానికి తన భర్త మదన్ అని చెప్పి.. కాన్పు కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు బిడ్డకు తండ్రిగా ఓ లాయర్ పేరును చెప్పింది. కానీ భర్త మాత్రం.. ఆ బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రని.. డీఎన్ఏ టెస్టులు చేయించాలని డిమాండ్ చేశారు. కానీ ఈ ఆరోపణల్ని విజయసాయిరెడ్డి తోసిపుచ్చారు. శాంతిని తాను ఓ కూతురుగా చూసి ఆదరించానని.. సాయం చేశానని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సస్పెన్షన్ లో ఉన్న శాంతి లైఫ్ స్టైల్ లగ్జరీగానే ఉంటోందని దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నారు. ఆమెపై అన్ని అభియోగాలు నిరూపితం కావడంతో.. టెర్మినేట్ చేయాలని సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. నేడో రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.