సెప్టెంబరు రిలీజులు ఇప్పటికే అటు ఇటుగా జరిగాయి. రవితేజ మాస్ జాతర వాయిదా పడింది. కొత్త డేట్ ఇంకా ఇవ్వలేదు. తేజ సజ్జా మిరాయ్ వారం వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబరు 25 మీద వుంది. పవన్ కల్యాణ్ ఓజీ, బాలకృష్ణ అఖండ2 ఇదే డేట్‌ని లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.
పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’పై భారీ అంచనాలు వున్నాయి. అయితే ఇటీవల ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఇంకా ప్యాచ్ వర్క్ మిగిలి ఉందని, వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. అయితే ‘సువ్వి.. సువ్వి’ సాంగ్ పోస్టర్ రిలీజ్ చేస్తూ తాము రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నామని టీం చెప్పకనే చెప్పింది.
బాలకృష్ణ అఖండ2 కూడా సెప్టెంబరు 25నే విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే బాలయ్య డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో కదలికలు కనిపించడం లేదు. బాలయ్య బర్త్‌డే కి వదిలిన గ్లింప్స్ తప్పితే ఈ సినిమా నుంచి మరో కంటెంట్ రాలేదు. సాంగ్స్ జనాల్లోకి ఇంకా చేరలేదు. టీజర్, ట్రైలర్ రావాలి. ప్రమోషన్స్ చేసుకోవాలి. కానీ టీం నుంచి ఎలాంటి అలికిడి లేదు. పోస్ట్ ప్రొడక్షన్‌కి ఇంకాస్త సమయం పడుతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. అందుకే టీం సైలెంట్‌గా వుందని ఇన్సైడ్ టాక్. ఈ నెల 30న బాలయ్యని సత్కరిస్తూ ఓ వేడుక జరగనుంది. ఆ వేడుకలో బాలయ్య అఖండ2 రిలీజ్‌పై ఓ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ వుంది.