జగన్ రెడ్డి నిర్వాకాలు, ఆయన చెప్పిన తప్పుడు పనులు చేసిన మరో ఐపీఎస్ జైలు పాలయ్యారు. జగన్ రెడ్డి హయాంలో చెలరేగిపోయిన ఐపీఎస్ అధికారి ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిది. మూడు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పు వచ్చింది జూలై 31న. మూడు వారాలు దాటిపోయినా ఆయన కోర్టులో లొంగిపోకపోవడంతో.. ఏం జరిగిందా అని అందరూ ఆరా తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మంగళవారం కోర్టులో లొంగిపోయారు.
సుప్రీంకోర్టు లొంగిపోవడానికి నాలుగు వారాల గడువు ఇచ్చిందని ఆయన తరపు లాయర్లు చెబుతున్నారు. ఏసీబీ కోర్టులో లొంగిపోవడంతో ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చాలా మందిని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిన ఆయన ఇప్పుడు అడ్డంగా అవినీతి చేసి దొరికిపోయి జైలుకెళ్లాల్సి వచ్చింది. డీజీ హోదాలో ఉన్న సీతారామాంజనేయులు ఇప్పటికే జైలుకు వెళ్లి.. ఆరోగ్య కారణాల మీద బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నారు.
ఇంకా కొంత మంది ఐపీఎస్ అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంది. కానీ ఎంతో భవిష్యత్ ఉన్న అధికారులు అని ఏమో కానీ ప్రభుత్వం చూసీ చూడనట్లుగా ఉంది. అరెస్టు ఎందుకు చేయలేదని కోర్టులు అడిగినా అది దర్యాప్తు అధికారి విచక్షణాధికారం అని సమాధానం చెప్పాల్సి వచ్చింది. చట్టాలను చుట్టాలుగా చేసుకుని రాజకీయ బాసుల కోసం అడ్డగోలు పనులు చేసిన వారంతా.. చట్టం పవర్ ను తక్కువగా అంచనా వేయడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి