వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినాయకుడి పూజ చేశారు. ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కనీసం హారతి ఇవ్వడం కూడా రాలేదు. కొబ్బరికాయ కొట్టలేకపోయారు. పార్టీ నేతలు ముగ్గురు ఉండి ఆయనతో పూజ అయిందని అనిపించారు. జగన్ రెడ్డికి ఎందుకీ తిప్పలు అని చాలా మంది ఈ వీడియోలు చూసి అనుకున్నారు. నిజమే కదా.. జగన్ రెడ్డికి ఎందుకీ తిప్పలు ?. ఆయన ప్రజల్ని మోసం చేయాలని అనుకోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. తనను తాను నిజాయితీగా ఆవిష్కరించుకుంటే.. ఇలాంటి డ్రామాలు చేయాల్సిన అవసరం ఉండదు.
చంద్రబాబు క్రిస్మస్, రంజాన్ వేడుకల్లోనూ పాల్గొంటారు కదా !
చంద్రబాబుకు లేని సమస్య జగన్ కు వస్తోంది. చంద్రబాబునాయుడు హిందువు.అయినప్పటికీ ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. క్రైస్తవులకు సందేశం ఇస్తారు. క్రిస్తు చెప్పిన మంచిమాటల్ని చెబుతారు. అలాగే రంజాన్ పండుగ సమయంలో ఇఫ్తార్ విందులు ఇస్తారు. ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. అంత మాత్రాన ఆయనను ఎవరూ ఆయనను క్రైస్తవుడనో.. ముస్లిం అనో అనడం లేదు. ఎందుకంటే.. తాను హిందువు అయినప్పటికీ అన్ని మతాలను.. అన్ని దేవుళ్లనూ ఆయన సమానంగా చూస్తారు. ఆ నిజాయితీ ఆయన చేసే పనుల్లో కనిపిస్తుంది.
జగన్ హిందూ వేడుకల్లో పాల్గొనడం వెనుక కృత్రిమత్వం
జగన్ కూడా..అన్ని వేడుకల్లో పాల్గొంటారు. హిందూవేడుకల్లోనూ పాల్గొంటారు. కానీ ఆయన ఏ హిందూ పండుగలో పాల్గొన్నా.. అందులో కృత్రిమత్వం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిజాయితీగా చేయరు. ఎవరినో నమ్మించడానికి చేస్తున్నట్లుగా ఉంటుంది. నిజానికి ఆయన క్రైస్తవుడు. ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన దేవుడ్ని నమ్మున్నారు. ఇతరులు నమ్ముకున్న వాళ్లు దేవుళ్లు కాదా.. అంటే.. ఎవరూ చెప్పలేరు. దానికి సమాధానం ఉండదు. తాను క్రైస్తవుడిని అంటే ఓట్లు వేయరు అని.. ఓట్లు కావాలంటే.. తాను హిందువునే అని జనం అనుకోవాలని ఆయన ఈ ఫీట్స్ చేస్తున్నారు. ఫలితంగాఎప్పటికప్పుడు ట్రోల్ అవుతున్నారు.
జోసఫ్ విజయ్‌కు ఉన్న ధైర్యం కూడా లేదా ?
తమిళనాడులో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన హీరో విజయ్ కూడా.. తన పేరును జోసఫ్ విజయ్ గా ప్రకటించుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కూడా క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చారు. సినిమాల్లో విజయ్ గా ప్రసిద్ధుడైనా.. ప్రజా జీవితంలోకి వచ్చేటప్పటికీ పూర్తి పేరు ప్రకటించుకున్నారు. జోసేఫ్ విజయ్ గానే ఆయన ప్రజల ముందుకు వస్తున్నారు. అలా అని ఆయన హిందువుల్ని, ముస్లింలను అవమానించినట్లు కాదుగా. ఆయన అంగీకరించి..నిజాయీతీగా రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి నిజాయితీ లేకుండా.. తాను హిందువును అని నమ్మించేందుకు నాటకాలు ఆడటం వల్ల నష్టమే జరుగుతుంది. జగన్ అదే దారిలో ఉన్నాడు. ఆయన తను నిఖార్సైన క్రైస్తవుడ్ని అని ప్రకటించుకుని.. ఇతర మతాలు, దేవుళ్లపై గౌరవం ఉందని ధైర్యంగా చెప్పుకున్నప్పుడే.. ఈ ఇబ్బందులు తెరపడతాయి. లేకపోతే మోసం చేస్తూ దొరికిపోతూనే ఉంటారు.