అనుష్క ఘాటీ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడు రిలీజ్ గ్లింప్స్ వదిలారు. ఘాటీలో ఉన్న యాక్షన్ ఈ గ్లింప్స్‌లో చూపించారు. అనుష్క ఇందులో శీలావతి క్యారెక్టర్లో కనిపిస్తోంది. ఆ పాత్రలో యాక్షన్ చూస్తుంటే స్వీటీకి ఇది నెవర్ బిఫోర్ రోల్ అనిపిస్తోంది. తూర్పుకనుమల్లో షూట్ చేసిన సినిమా ఇది. గంజాయి నేపథ్యం, పర్వత శ్రేణులు, అక్కడి కల్చర్… ఇవన్నీ విజువల్‌కి ఒక ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చాయి. బీజీఎం కోసం వాడిన ఇంగ్లీష్ ట్యూన్ కూడా క్యాచీగా ఉంది.
క్రిష్, అనుష్కకి సరోజా లాంటి క్లాసిక్ రోల్ ఇచ్చారు. ఘాటీలో శీలావతి పాత్ర కూడా ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉందని గ్లింప్స్ హామీ ఇస్తోంది. స్వీటీ ఈ రేంజ్లో యాక్షన్ చేసిన సినిమా బహుశా ఇదే అనుకోవాలి. ఒక బాధితురాలు, నేరస్తురాలు, ఆ తర్వాత లెజెండ్‌గా మారిన జర్నీ ఆసక్తికరంగా ఉంది. ‘‘వాళ్లు ఊరుకోరు, వీళ్ళు ఊరుకోరు అంటే… నేను ఊరుకోను’’ అనే స్వీటీ డైలాగ్ టీజర్లో కొసమెరుపు. మొత్తానికి ఈ గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది.
