ఆసియా కప్ ఫైనల్లో భారత్ సంచలన విజయం వెనుక తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన ఉంది. మ్యాచ్ తర్వాత నారాలోకేష్‌కు తిలక్ వర్మ గిఫ్ట్ ఇచ్చారు. తన క్యాప్ పై సంతకం చేసి విజయ స్మారకంగా మ్యాచ్ తర్వాత తిలక్ “లోకేష్ అన్నా… ఇది నీకోసమే” అని చెప్పుతూ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఈ గిఫ్ట్‌ను చూసి లోకేష్ భావోద్వేగంగా మారాడు. తన ట్విట్టర్ పోస్ట్‌లో “తమ్ముడు తిలక్ వర్మ బహుమతి.. నాకెంతో ప్రత్యేకం” అని స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిలక్ వర్మ, నీతిష్ రెడ్డి వంటి తెలుగు యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తోంది. తిలక్ వర్మకు నారా లోకేష్ సాన్నిహిత్యం, స్నేహం ఉండటంతో ఇలా పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఉపయోగించిన క్యాప్ మొమరబుల్గా మార్చారు.
నారా లోకేష్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ను సంస్కరిస్తున్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు పెద్ద ఎత్తున ఏపీ నుంచి వచ్చేలా మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారు. టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నారు. ఐసీసీ చైర్మన్ జే షాతో నారా లోకేష్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. దీన్ని ఉపయోగించుకుని ఏపీ ఆటగాళ్లకు లోకేష్ మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నారు.