పండుగ అంటే ప్రతి కుటుంబం సంతోషంగా గడపటం. ఒక్క కుటుబంంలో అలాంటి వాతావరణం ఉంటే అది పండుగ కాదు. అన్ని ఇళ్లు కళకళలాడాలి, ఎక్కడ చూసినా ఉత్సవవాతావరణం ఉండాలి. సమాజంలో ఆనందం ఉండాలి. అప్పుడు మాత్రమే అసలైన పండుగ.
ఆంధ్రప్రదేశ్ లో ఓ ఐదుసంవత్సరాల పాటు పండుగలు ఎలా జరిగాయో.. ఎవరికీ గుర్తు లేవు. నిరంతరం భయం, భయంగా బతికిన ప్రజలు, పండుగలు, పబ్బాలు కూడా అలాగే చేసుకున్నారు. పండుగ వచ్చిందంటే భక్తులను దోపిడీ చేయడానికే అన్నట్లుగాఏర్పాట్లు ఉండేవి. ఆలయాలకు పండుగ శోభ తెచ్చిపెట్టడం వృధా ఖర్చు అనుకునేవాళ్లు. ఇప్పుడు ఏ ఆలయం చూసినా పండుగ శోభతో కళకళలాడుతోంది.
దసరా అంటే మైసూరు గుర్తుకొస్తుంది. కానీ ఈ ఏడాది నుంచి దసరా ఉత్సవాలు అంటే విజయవాడ కూడా గుర్తుకు వచ్చేలా చేశారు. పది రోజుల పాటు వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆధ్యాత్మక భావనతో పాటు దసరా అంటే సంతోషం అనేలా మార్చారు. విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించారు. కృష్ణమ్మకు కన్నుల పండువగా హారతులు ఇస్తున్నారు.
పండుగలు ప్రతి ఏడాది వస్తాయి.. కానీ ఓ ప్రత్యేకమైన సంబరాల, ఆనందాల కళ ఉన్న పండుగలు మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సారి ఏపీలో అలాంటి పండుగ కళ కనిపిస్తోంది.