కెజీఎఫ్‌తో యశ్‌కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఒక్కసారిగా ఆయన స్టార్డమ్ పెరిగింది. ఆ స్టార్ పవర్‌కు తగ్గట్టుగానే తన కొత్త సినిమా టాక్సిక్ ను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బోల్డ్ గ్లింప్స్ సంచలనంగా మారింది. తాజాగా విడుదలైన టీజర్ కూడా అదే స్థాయి హైప్‌ను కొనసాగించింది.
“ఈసారి యుద్ధం వేరు.. వాళ్ల కుతంత్రాలు వేరు.. అందరితో విరోధం పెట్టుకుని బతకలేవు… పట్టుదల వదిలేయ్ రాయ” అనే వాయిస్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం కిరాతకమైన వైలెంట్ వరల్డ్‌ను పరిచయం చేసింది.
టీజర్లో రక్తపాతం ఏరులై పారినట్టుగా చూపించారు. ముఖ్యంగా చివరి ఇరవై సెకన్లు అయితే ఊచకోత. యశ్ క్యారెక్టర్ మేకోవర్ కొత్తగా కనిపిస్తోంది. చివర్లో కనిపించిన ఓ క్యారెక్టర్ యమ డేంజర్‌గా అనిపిస్తోంది. గీతూ మోహన్‌దాస్ హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో టీజర్‌ను కట్ చేశారు. హ్యుమా ఖురేషీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ టీజర్లో వారికి చోటు ఇవ్వలేదు. మొత్తం హింస, యాక్షన్‌కే ప్రాధాన్యం ఇచ్చారు.
మార్చి 19న ఈ సినిమా విడుదల కానుంది. ‘టాక్సిక్’లో ఎంత హింస ఉండబోతుందో టీజర్ స్పష్టంగా చూపించింది. ఈ సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే, ఇలాంటి వైలెంట్ యాక్షన్ సినిమాలు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది.
