ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలతో ప్రతిపక్షం లేదు.. ఉన్నా ప్యాలస్‌కే పరిమితం అయింది. అందుకే ప్రతిపక్షం ఉంది అన్న ఫీలింగ్ ఎవరికీ రావడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ గురించి అందరూ మర్చిపోయారు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు మాత్రం బలపడుతున్నారు. ప్రభుత్వం ప్రజా కోణం నుంచి దృష్టి మరల్చకుండా వారు ఏమనుకుంటారో అన్న భయంతో నిర్ణయాలు తీసుకునేలా చేయడంలో .. బలమైన ప్రతిపక్షం ఏపీలో తయారు అయింది. అదే ప్రజా ప్రతిపక్షం.
నకిలీ మద్యంలో ప్రజా ప్రతిపక్ష విజయం
తంబళ్లపల్లెలో నకిలీ మద్యం తయారీ ముఠా పట్టుబడింది. వైసీపీ హయాంలోనే వారు ఈ కుటీర పరిశ్రమను ప్రారంభించారు. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. తంబళ్లపల్లె నుంచి పోటీ కూడా చేశారు. ఆ దందాను ఇప్పటి వరకూ కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు దొరికిపోయారు. వారిపై చర్యలు తీసుకునేవరకూ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఎవరూ వదిలి పెట్టలేదు. టీడీపీ కార్యకర్తలు కూడా అలాంటి వారిని వదిలి పెట్టకూడదని స్పష్టం చేశారు. దీంతో తప్పు చేసిన ఎవర్నీ రక్షించే ప్రశ్నే లేదని టీడీపీ చర్యలు తీసుకుంది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
ఇతర విషయాల్లోనూ ప్రభుత్వానికి గట్టిగా ప్రశ్నలు
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు సోషల్ మీడియాలోనూ..బయట కూడా ఎక్కువగానే వారు. వారు టీడీపీ సానుభూతిపరులా లేకపోతే వ్యతిరేకులా అన్నది కాదు. సరైన సబ్జెక్ట్ మీద ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంటే వెంటనే ప్రశ్నిస్తున్నారు. ఉల్లి ధరల సమస్య మీద.. ఇతర రైతుల సమస్యల మీద.. వైసీపీ ప్రశ్నించిందేమీ లేదు. డ్రామాలు చేసి.. ప్రచారం చేసుకున్నారు. కానీ అసలు ప్రశ్నలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా సంధించింది మాత్రం .. టీడీపీ సానుభూతిపరులు, ఇతర సామాన్య ప్రజలే. వారి అభిప్రాయాలతోనే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
పూర్తిగా దారి తప్పిన వైసీపీ
ప్రతిపక్షహోదా అంటూ చిన్న పిల్లల రాజకీయం చేస్తూ వైసీపీ పూర్తిగా దారి తప్పినట్లుగా కనిపిస్తోంది. అయితే ప్రెస్‌మీట్ లేకపోతే ప్రెస్‌నోట్ అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. ప్రతి పనిలోనూ వారు చేసిన నిర్వాకాలు బయటపడతాయనే ఇలా చేస్తున్నారు . జగన్ రెడ్డి విహారయాత్రకు వెళ్లే ముందు ఏదో ఒకటి చేయకపోతే బాగుండదని ఆయన నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన పెట్టుకున్నారు తప్ప ఆయన రాజకీయంలో నిజాయితీ లేదు. అందుకే ప్రజలు, టీడీపీ సానుభూతిపరులే ప్రజాప్రతిపక్షం బాధ్యత తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజల వైపు ఉంటున్నారు.