హైదరాబాద్ రాయదుర్గంలోని రెండు ల్యాండ్ పార్సెల్స్ ను వేలం వేయడం ద్వారా తెలంగాణకు రూ. మూడు వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. అత్యధికంగా ఎకరం రూ. 177 కోట్లు పలికింది. మరి బెంగళూరులో ఇలాంటి భూమి వేలం వేస్తే ఎంత ధర పలుకుతుంది ?. కనీసం వెయ్యి కోట్లు పలికే అవకాశం ఉంది.
ఇందిరానగర్, కోరమంగళ వంటి ప్రాంతాలు బెంగళూరులో అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ప్రాంతాలు. ఇక్కడ ఏకమొత్తంగా ఎకరాల్లో భూములు అందుబాటులో లేవు. ఒక వేల అందుబాటులో ఉంటే.. ఇప్పుడు అక్కడ ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే.. ఇందిరానగర్, కోరమంగళలో ఎకరం భూమి ధరలు సా రూ. 800 కోట్లు నుండి రూ.1,400 కోట్ల వరకూ పలికే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాల అంచనా. మార్కెట్ డేటా ఇదే చెబుతున్నాయని నిపుణులు అంటున్నారు.
బెంగళూరు రియల్ ఎస్టేట్ ముఖ్యంగా ఐటీ స్పేసింగ్ కు అనుకూలమైన ప్రాంతాల్లో ధరలు ఎవరూ ఊహించని విధంగా ఉంటున్నాయి. ప్రస్తుతం నాలుగైదేళ్ల పాటు .. అద్దెల కోసమే వందల కోట్లు వెచ్చిస్తున్నాయి కంపెనీలు. యాపిల్ , టీసీఎస్ వంటి కంపెనీలు ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద డీల్స్ చేసుకున్నాయి. హైదరాబాద్ అదృష్టం ఏమిటంటే.. భూమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందుబాటులో ఉంది. రేట్లు రికార్డు స్థాయిలో వస్తున్నాయి.