ఫిల్మ్ ఛాంబర్ లో ఇటీవల ఓ ఆసక్తికరమైన టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. అదే… ‘చుక్కలు తెమ్మన్నా.. తెంచుకురానా’. ఏప్రిల్ 1 విడుదల సినిమాలోని ఓ సూపర్ హిట్ పాట ఇది. పల్లవిలోని తొలి పంక్తి… టైటిల్ అయ్యింది. వైజయంతీ మూవీస్ ఈ టైటిల్ రిజిస్టర్ చేయించింది. ఓ కొత్త దర్శకుడితో ఈ సినిమా చేయాలనుకొంటున్నారు. కథ రెడీ అయ్యింది. కాకపోతే ఇది లేడీ ఓరియెంటెడ్ కథ. సినిమా అంతా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. అందుకోసం ఓ స్టార్ హీరోయిన్ కావాలి. శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ ఇద్దరిలో ఎవరైనా సరే.. ఈ ప్రాజెక్టుకు మంచి హైప్ రావడం ఖాయం.
కథలో హీరోయిన్ పాత్రకు మంచి స్కోప్ కనిపిస్తోంది. ఎవరు చేసినా… నిలబడిపోయే పెర్ఫార్మెన్స్ ఇవ్వడం గ్యారెంటీ అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కథ కూడా బాగా కుదిరిందట. తండ్రీ కూతుర్ల మధ్య అనుబంధం చాలా గట్టిగా ఉండబోతోందని, ఓ తండ్రి కోసం కూతురు ఏం చేసిందన్న కాన్సెప్టుతో ఈ కథ రెడీ అవుతోందని తెలుస్తోంది. ‘లెనిన్’లో ముందుగా శ్రీలీలను అనుకొన్నారు. ఆమె డేట్లు క్లాష్ రావడంతో ఆ ప్లేసులోకి భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. ఇప్పుడు ఇదే ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమా కోసం పోటీలో ఉన్నారు. చివరికి ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రావొచ్చు.