ఆఫ్రికా దేశాలు అత్యంత పేద దేశాలు. ఆ దేశాల్లో ప్రజలకు తిండి కోసం అల్లాడిపోతూంటారు. ఎన్నో వనరులు ఉన్నప్పటికీ వారి జీవితాలు మారవు. బక్క చిక్కిన బతుకుల గురించి ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల నివేదికల్లో వెల్లడవుతూ ఉంటాయి. అలాంటి దేశాల ప్రజల్ని చూసి అందరూ పాపం అనుకుంటారు. కానీ రెడ్డీస్ గ్లోబల్ యజమానులు వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి మాత్రం వారి శరీరాల్లో ఇంకా రక్తం మిగిలిపోయి ఉంది. పీల్చుకోవచ్చని ప్లాన్ చేశారు. మద్యం వ్యాపారంతో కల్తీ మద్యం అమ్మి కొన్ని వందల మంది చావుకు కారణం అయ్యారని అంతర్జాతీయంగా ఆరోపణలు వస్తున్నాయి.
పాపం ఆఫ్రికన్లు అనుకోని వైఎస్ బ్రదర్స్
రెడ్డీస్ గ్లోబల్ మద్యం వ్యాపారం విషయంలో .. ఆఫ్రికా దేశాల్లో ప్రజల చావులకు కారణం అవుతున్న విషయం సంచలనంగా మారింది. ఫ్రాన్స్ పత్రికల్లోనూ వైరల్ అయింది. జాంబియా, మొజాంబిక్, కెమరూన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ రెడ్డీస్ గ్లోబల్ మద్యం మద్యం ఆరోగ్య సమస్యలు, పాలసీ జోక్యాలు, భారతదేశంలోని లిక్కర్ స్కామ్‌లతో ముడిపడిన ఆరోపణలు ఉన్నట్లుగా పత్రికలు ప్రకటించాయి. మొదట జాంబియాతో ప్రారంభించి ఆఫ్రికా అంతా విస్తరించారు. ఆఫ్రికాలో యువకులను మద్యానికి బానిసగా మార్చేందుకు కుట్ర పన్నినట్లుగా అనుమానాలు ఉన్నాయి. నిరుపేద దేశాలైన ఆఫ్రికాలో ప్రపంచ సగటు కంటే ఎక్కువగా మద్యం తాగే వారు చాలా ఎక్కువగా ఉన్నారు. అక్కడి రాజకీయ నేతలకు లంచాలు ఇచ్చి తమ దందాను సాగించేవారని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆఫ్రికాలో ఇల్లీగల్ లిక్కర్ మార్కెట్ వాటా యాభై శాతం వరకూ ఉందని అంచనా.
బక్క చిక్కిన బతుకులపై రాక్షసత్వం
అక్కడి పరిస్థితుల్ని అవినీతి మయం చేసి.. ఆఫ్రికా యువత రక్తాన్ని తాగుతోంది రెడ్డీస్ గ్లోబల్ అని అక్కడి ప్రజలు ఆందోళనలు చేశారు. సాధారణంగా ఆఫ్రికా విషయంలో ఎంత దొంగ వ్యాపారాలు చేసేవారు అయినా కాస్త జాలి చూపుతారు. అక్కడి వనరులపై కన్నేసి.. మైనింగ్ చేశారంటే .. దాని వల్ల నేరుగా దేశ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడదు..కానీ ఇలా లిక్కర్ ద్వారా ఆఫ్రికా భవిష్యత్ ను అంధకారం చేసి డబ్బులు దండుకోవడం అంటే ..మామూలు రాక్షసత్వం కాదు. రెడ్డీస్ గ్లోబల్ అదే చేస్తోంది.
ఐదేళ్లు ఏపీలో సరఫరా అయింది రెడ్డీస్ గ్లోబల్ లిక్కరే ?
ఐదు సంవత్సరాల పాటు ఏపీలో జరిగిన లిక్కర్ దందా వ్యవహారంలో ఈ రెడ్డీస్ గ్లోబల్ జోక్యం చేసుకోలేదని అనుకోవడం అమాయకత్వం. ఏపీలో అమ్మిన మద్యం .. ప్రముఖ బ్రాండ్లు కాదు. లోకల్ తయారీనే. ఆ లిక్కర్ తయారు చేయడానికి లోకల్ డిస్టిలరీలను కబ్జా చేశారు. ఈ తయారీ వెనుక రెడ్డీస్ గ్లోబల్ ఉందో లేదో తేల్చాల్సి ఉంది. ఈ దందా వెనుక ఉన్న దాన్ని.. లిక్కర్ సొమ్ములో సంపాదించిన మొత్తాన్ని ఆఫ్రికాకు తరలించి అక్కడ్నుంచి ఇండియాకు తరలించిన వైనం కూడా వెలుగులోకి రావాల్సి ఉంది.