టీడీపీ గెలవగానే వీఆర్ఎస్ తీసుకుని .. రీల్స్ చేసుకున్న మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ హఠాత్తుగా ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేతో టచ్ లోకి వచ్చారు. ఆయనకు రెండు గంటలకు పైగా ఇంటర్యూ ఇచ్చారు. అయితే ఆయన అందులో జగన్ పాలనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రాజకీయ నేతలు తీసుకునే నిర్ణయాలను తాము అమలు చేస్తామని అంతకు మించి చేయగలిగిందేమీ లేదని చెప్పారు. మరి ఇప్పుడెందుకు అంటే.. ఏపీకి మళ్లీ సేవ చేయాలనుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
అంటే.. వీఆర్ఎస్ తీసుకుని తొందరపడ్డానని ఇప్పుడు మళ్లీ దాన్ని క్యాన్సిల్ చేసుకుంటానని.. పోస్టింగ్ ఇస్తే చేసుకుంటానన్న సందేశాన్ని ఆయన పంపించారు. కోపంతో తొందరపడి వీఆర్ఎస్ తీసుకున్నానని .. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నానని అన్నట్లుగా ఆయన ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. చంద్రబాబును కలవాలనుకున్నా నీరబ్ కుమార్ ప్రసాద్ తనను కలవనీయలేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఒకప్పుడు చంద్రబాబుతో సన్నిహితంగా పని చేశానని .. సీఎంవోలోకి కూడా తీసుకుంటామన్నారని గుర్తు చేసుకున్నారు. తొందరపడి వీఆర్ఎస్ తీసుకున్నా తర్వాత మూడు నెలల తర్వాత ఉపసంహరించుకుంటానని సమాచారం పంపినా అంగీకరించలేదని.. చంద్రబాబు తనపై కోపంతో ఉన్నారని ఉన్నతాధికారులు చెప్పారని వివరించారు.
ప్రవీణ్ ప్రకాష్.. వీఆర్ఎస్ ఇచ్చేసి ఖాళీగా ఉన్నారు. ఆయనకు ఏమీ తోచడం లేదు. ఆయన కుటుంబసభ్యులు కూడా అసంతృప్తితో ఉన్నారు . ఇదే విషయాన్ని ఆయన చెప్పుకున్నారు. అందుకే మళ్లీ చంద్రబాబు కనికరిస్తే వీఆర్ఎస్ ను వెనక్కి తీసుకుని సర్వీసులో చేరాలనుకుంటున్నారు. తన ఆలోచనను ఆయన ఆర్కే ద్వారా వెల్లడించారు. తనకు రాజకీయ ఆలోచనలు ఏవీ లేవని.. తన స్వస్థలం వారణాశిలో తనను ఎవరూ గుర్తు పట్టరని కూడా వాపోయారు.
ప్రవీణ్ ప్రకాష్ తో కలిసి ఆర్కే బిగ్ డిబేట్ పెట్టడానికి కారణం జగన్ పై కొత్త బాంబులేయడానికి కాదు.. ప్రవీణ్ ప్రకాష్ కు పోస్టింగు ఇప్పించడానికి . మరి ఇచ్చేస్తారా ?