పండగ సీజన్ హైదరాబాద్ ఎస్టేట్ మార్కెట్‌కు కలిసి వస్తోంది. గ్రేటర్ పరిధిలో ఈ ఏడాదిలోనే అత్యధిక ఇళ్ల రిజిస్ట్రేషన్లు సెప్టెంబరులో జరిగాయి. సెప్టెంబర్ నెలలో 6612 రిజిస్ట్రేషన్లు జరిగాయి. గడిచిన ఏడాదితో పోలిస్తే 35 శాతం అధికమని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. కొండాపూర్‌లో 3వేల చ.అ.పైన ఉన్న రూ.20.42 కోట్ల స్థిరాస్తి రిజిస్ట్రేషన్ జరిగింది.
2024 సెప్టెంబరులో 4903 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.2820 కోట్లు. 2025లో ఇదే నెలలో 6612 రిజిస్ట్రేషన్లు జరగితే వాటి విలు రూ.4804 కోట్లు. విలువల్లో వార్షిక వృద్ధి 70 శాతంగా నమోదైంది. సెప్టెంబరులో రూ.కోటిపైన విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో 151 శాతం పెరుగుదల ఉంది. మొత్తం విక్రయాల్లో విలువ పరంగా వీటి వాటానే 53 శాతం. అంటే కనీసం ఇప్పుడు ఒక ఇంటి విలువ రూ.కోటి అన్నట్లుగా మారిందని అనుకోవచ్చు.
1000 నుంచి 2000 చ.అ. విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్ల వాటా 67 శాతం. హైదరాబాద్‌లో 14 శాతం, రంగారెడ్డి జిల్లాలో 45 శాతం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 40 శాతం స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ అయ్యాయి. కొండాపూర్‌లో ఒక స్థిరాస్తి అమ్మకం రూ.20.42 కోట్లతో జరిగింది. ఈ మధ్యకాలంలో ఇదే అత్యధికం. వీరు స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలే ఏకంగా రూ.1.62 కోట్లు చెల్లించారు.